Karthika Somavaram: ఇవాళ కార్తీక సోమవారం కదా.. ఈ పని చేశారా.. లేదా..!

ABN , First Publish Date - 2022-10-31T12:52:34+05:30 IST

అన్ని మతాల కంటే కార్తీకమాసం ఎంతో విశిష్టత కలిగినదని లలితా శ్రీపీఠం వ్యవస్థాపకుడు దుర్గబాబు అన్నారు. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుందని..

Karthika Somavaram: ఇవాళ కార్తీక సోమవారం కదా.. ఈ పని చేశారా.. లేదా..!
ప్రతీకాత్మక చిత్రం

కామవరపుకోట: అన్ని మతాల కంటే కార్తీకమాసం (Karthika Masam) ఎంతో విశిష్టత కలిగినదని లలితా శ్రీపీఠం వ్యవస్థాపకుడు దుర్గబాబు అన్నారు. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుందని, కృత్తిక నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చిందన్నారు. ఈ నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు (Karthika Somavaram) ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. దేవతల్లో ప్రథముడైన అగ్ని దేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాడాల్లో మొదటిది కృత్తికయే వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంలోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరుముఖాలు కలవాడు. కృత్తికకు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికకు ఒక విశిష్టత ఉందన్నారు. కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్ధం.

ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాటు తాగాడని పురాణాలు తెలియజేస్తున్నాయన్నారు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమారస్వామికి కార్తీకేయుడనే పేరు వచ్చిందన్నారు. సోమవారానికి చంద్రుడు అధిపతి. కాబట్టి కార్తీక మాసంలోని సోమవారంలో చేసిన పూజలకు, దీపారాధనలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయన్నారు. మిగిలిన రోజుల్లో ఎటువంటి భక్తి కార్యక్రమాలు చేయకపోయినా కార్తీక సోమవారాల్లో మాత్రం వేకువజామునే తలారా చన్నీటిస్నానం చేసి శివాలయాన్ని సందర్శించి కార్తీక దీపారాధనలు నిర్వహిస్తే మంచి పుణ్యఫలం లభిస్తుందని వివరించారు.

Updated Date - 2022-10-31T12:52:56+05:30 IST