Satyadev: ‘ఖుషి’ సినిమా తర్వాత లైఫ్ టర్నయింది (OHRK Promo)

ABN , First Publish Date - 2022-12-09T00:35:41+05:30 IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన అతి తక్కువ సినిమాలతోనే టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ఆయన సొంతం. రీసెంట్‌గా ఆయన మెగాస్టార్

Satyadev: ‘ఖుషి’ సినిమా తర్వాత లైఫ్ టర్నయింది (OHRK Promo)
Satyadev Open Heart with RK

టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన అతి తక్కువ సినిమాలతోనే టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ఆయన సొంతం. రీసెంట్‌గా ఆయన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) చిత్రంలో విలన్‌గానూ, అలాగే బాలీవుడ్ డైరెక్ట్ చిత్రంలోనూ నటించి.. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) చిత్రం డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. సినిమా విడుదల కాబోతోన్న సంతోషంలో ఉన్న సత్యదేవ్.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని.. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో... (Open Heart with RK Promo)

బేసిక్‌గా మీరు సాఫ్ట్‌వేర్ కదా.. సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఆలోచన ఎందుకొచ్చింది?

సత్యదేవ్: మా కజిన్స్ వాళ్ళందరూ ఏడిపించేవాళ్లన్న మాట.. ‘ఖుషి’ (Kushi) సినిమా చూసి కత్తి ఫైట్ నేర్చుకుంటాననేవాడిని. అప్పుడే గాలి మళ్లీంది. సినిమాల్లో ఓ డైలాగ్ ఉంటుంది. ఐశ్వర్యరాయ్‌ని లవ్ చేయాలంటే... అనకాపల్లి కాదు.. బాంబే వెళ్లాలని.

జనరల్‌గా ఇంట్లోవాళ్ళు ఏమంటారంటే సాఫ్ట్ వేర్ అంటే బ్రహ్మాండమైన ఉద్యోగం కదా.. అవన్నీ వదిలేసుకొని ఎందుకు అని ఇంట్లో డిస్కషన్ రాలేదా?

సత్యదేవ్: నా వైఫ్ దీపికా (Deepika) సర్.. నన్ను స్ట్రాంగ్‌గా నమ్ముతుంది. ఎలా అంటే.. ఎడారిలోనైనా బతికేస్తాడనేంత నమ్మకం నాపై.

మంచి నటుడు అని అనిపించుకోగలననే నమ్మకం ఎప్పుడు కలిగింది?

సత్యదేవ్: ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు అందరూ అంతా బాగుంది.. ఈ నుదిటి మీద మార్క్ చాలా ఎక్కువగా కనబడుతుంది అనేవారు.

నుదిటిపైన ఏమైంది అసలు?

సత్యదేవ్: అన్నయ్య చిరంజీవి (Chiranjeevi)గారంటే నాకు పిచ్చి. వీరాభిమానిని. చిన్నప్పుడు కొదమసింహం (Kodama Simham) సినిమా చూసి.. అందులోని ఫైట్‌ని నేను మా ఇంట్లో ప్రాక్టీస్ చేశాను.. అది తెగి ఒక ఎడ్జ్ మీద పడి తల పగిలింది. అప్పుడు మా అమ్మ అంటుండేది.. ఎప్పుడైనా నాకు బాధేసినప్పుడు.. చంద్రుడికి ఒక మచ్చ ఉంది.. నీకు మచ్చ ఉందంటూ కవర్ చేసేది.

పూరి జగన్నాధ్‌ (Puri Jagannadh)ని ఎలా పట్టుకున్నారు?

సత్యదేవ్: నేను పట్టుకోలేదు సర్. ఆయన మన సినిమాలో నువ్వే హీరో అన్నప్పుడు.. నిజంగా జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి నాది.

మీకంటూ గాడ్‌ఫాదర్ (GodFather) అంటూ ఎవరు లేరు? కానీ ఇప్పుడు ఒక ‘గాడ్‌ఫాదర్’ వచ్చేశాడు సడన్‌గా.. ఎవరు?

సత్యదేవ్: అన్నయ్య చిరంజీవిగారు. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడ్ని. నాకు చిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి. ఆ రోజు ఒక రెండు గంటలు కూర్చోబెట్టి... ఉప్మా పెట్టి, కాఫీ ఇచ్చి.. నా జన్మ ధన్యమైపోయిందనుకోండి.

ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)లో ఏదో చేదు అనుభవం ఎదురైనట్లుంది?

సత్యదేవ్: వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది విజిట్ అంది. నేనేమో షూటింగ్ అన్నాను. అలా నా ముఖం వంక చూసింది. ఓ.. సారీ, ఈ షూటింగ్ కాదు.. ఫిలిం షూటింగ్ అన్నాను. ప్రపంచంలో ఇన్ని దేశాలు పెట్టుకుని.. ఆఫ్ఘనిస్తాన్‌ వచ్చావా.. ఆల్ ద బెస్ట్ అంది. నేను సూసైడ్ బాంబర్ అనుకుని.. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. వాళ్ళు ట్రిగ్గర్ షూస్‌లో పెట్టుకుంటారట. పాస్ పోర్ట్ సాక్స్‌లో పెట్టాడు.. అంతే నా కర్మ కాలిపోయింది. సౌండ్స్ ఏమైనా వినిపించినప్పుడు వెనక్కి, ముందుకు కదిలేవాడిని. ఒకవేళ టార్గెట్ మిస్ అవ్వుద్దేమో అని.

మీ సినిమాలలో ఎక్కడా డ్యూయట్స్ కనిపించవు కారణం?

సత్యదేవ్: బడికెళితే 123.. నా ఆటో ఎక్కితే 143.

మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమిటి? ఎవరి దగ్గర నుంచి వచ్చాయి?

సత్యదేవ్: ఈ రోజు మొత్తంలో 11 సార్లు అడిగారు.. వీడెవడు చాలా బాగా చేస్తున్నాడని 11 సార్లు అడిగారు. ఆ లెక్క కౌంట్ చేసేది ఎవరంటే.. ప్రకాశ్ రాజ్ గారు అంటూ.. ఇంకా ఆర్కే అడిగిన అనేక ప్రశ్నలకు సత్యదేవ్ నవ్వుతూ సమాధానాలిచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే.. ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart with RK) చూడాల్సిందే.

Updated Date - 2023-03-20T12:26:18+05:30 IST