Al hilm ball : బంతి మారింది
ABN , First Publish Date - 2022-12-13T03:35:43+05:30 IST
ఫిఫా ప్రపంచ కప్‌లో సెమీస్ మ్యాచ్‌లనుంచి ఉపయోగించే కొత్త బంతిని సోమవారం ఆవిష్కరించారు. అరబిక్‌లో ‘అల్ హిల్మ్’ (ఇంగ్లీష్‌లో ‘ద డ్రీమ్’)గా పిలిచే ఈ బంతిని ప్రఖ్యాత క్రీడా
దోహా: ఫిఫా ప్రపంచ కప్‌లో సెమీస్ మ్యాచ్‌లనుంచి ఉపయోగించే కొత్త బంతిని సోమవారం ఆవిష్కరించారు. అరబిక్‌లో ‘అల్ హిల్మ్’ (ఇంగ్లీష్‌లో ‘ద డ్రీమ్’)గా పిలిచే ఈ బంతిని ప్రఖ్యాత క్రీడా పరికరాల ఉత్పత్తి సంస్థ అడిడాస్ రూపొందించింది. అయితే క్వార్టర్‌ఫైనల్స్ వరకు ‘అల్ రిహ్లా’ అంటే ‘ద జర్నీ’ అనే పేరుతో పిలిచిన బంతిని వినియోగించారు. కాకపోతే..‘ద డ్రీమ్’ బంతిని కాస్త భిన్నంగా డిజైన్ చేశారు. రెండింటినీ ‘కనెక్టెడ్ బాల్’ సాంకేతికతతోనే తయారు చేశారు. ఈ సాంకేతికతవల్ల మ్యాచ్ అధికారులు టోర్నీలో కచ్చితంగా, వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఫిఫా తెలిపింది. ఇక ఈ బంతి లోపల ‘ఇంటర్నల్ మెజర్‌మెంట్ యూనిట్‘ (ఐఎంయూ) సెన్సర్లు ఉంటాయి. సెన్సర్లు సేకరించిన డాటాను కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించి..బంతి గమనాన్ని స్పష్టంగా కనుగొంటారు. తద్వారా గోల్ ఆఫ్‌సైడా..కాదా..అన్నది కచ్చితంగా నిర్ధారించగలుగుతారు.