Childrens Day: శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

ABN , First Publish Date - 2022-11-14T17:26:23+05:30 IST

శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Childrens Day: శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
Sri Ramakrishna VidyaNiketan High School, Nizamabad

నిజామాబాద్: శివాజీనగర్‌లోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్ధినీ విద్యార్ధులు వివిధ వేషధారణల్లో ముస్తాబై అలరించారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సముద్రాల శశిరేఖ ప్రసంగించారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులకు, దేశానికి మంచిపేరు తీసుకొచ్చేందుకు విద్యార్ధులు ప్రయత్నించాలని ఆమె పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కరెస్పాండెంట్ సముద్రాల శ్రీనివాసాచారి, ట్రెజరర్ మధుసూదనాచారి ఇతర బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-14T17:36:26+05:30 IST