TS News: ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే - ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-11-22T17:42:57+05:30 IST

Jogulamba Gadwal Dist: అందరూ చూస్తుండగానే బాధ్యతాయుత ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తీరును చూసి అక్కడున్న మిగతా అధికారులు, సిబ్బంది

TS News: ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే - ఎందుకంటే..

Jogulamba Gadwal Dist: అందరూ చూస్తుండగానే బాధ్యతాయుత ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తీరును చూసి అక్కడున్న మిగతా అధికారులు, సిబ్బంది భయపడిపోయారు. ఈ ఘటన జోగులంబ గద్వాల జిల్లాలో జరిగింది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి(Bandla Krishnamohan Reddy), జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా (ZP Chairperson Sarita)ను ప్రిన్సిపాల్ ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే పాఠశాలను జడ్పీ ఛైర్‌పర్సన్ ప్రారంభించారు. నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారని ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే కృష్ణామోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గల్లా పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో మిగతా అధికారులు ఖంగుతిన్నారు. ఈ ఘటనతో జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది.

Updated Date - 2022-11-22T18:53:06+05:30 IST