TarakaRatna: తారకరత్న సీటీ స్కాన్ రిపోర్ట్‌పై జరుగుతున్న ప్రచారం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-01-31T19:48:19+05:30 IST

గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో (Narayana Hrudayalaya) చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్యానికి సంబంధించి..

TarakaRatna: తారకరత్న సీటీ స్కాన్ రిపోర్ట్‌పై జరుగుతున్న ప్రచారం ఏంటంటే..

గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో (Narayana Hrudayalaya) చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయాలు బయటికొచ్చాయి. నారాయణ హృదయాలయ ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. సీటీ స్కాన్ రిపోర్ట్స్‌ను (TarakaRatna CT Scan Reports) పరిశీలించగా ఆక్సిజన్ తగిన మోతాదులో అందకపోవడంతో మెదడుపై ఆ ప్రభావం పడింది. దీంతో.. బ్రెయిన్ డ్యామేజ్ రికవరీ కోసం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.

క్రియాటిన్ ఎక్కువగా ఉండటంతో తారకరత్నకు డయాలసిస్ చేస్తున్నట్లు సమాచారం. మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్‌ యంత్రంతో రక్తాన్ని వడపోస్తారు. శుద్ధి చేసిన రక్తాన్ని తిరిగి సిర ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ప్రక్రియను డయాలసిస్ అంటారు. తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అనధికారికంగా అందిన తాజా అప్‌డేట్ ఇది.

ఇది కూడా చదవండి: TarakaRatna: కష్ట కాలంలో తారకరత్న భార్య అలేఖ్యకు అండగా నిలుస్తున్న ఈ వ్యక్తి ఎవరంటే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో (YuvaGalam PadaYatra) పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని (Kuppam) కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కుప్పంలోని పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చేర్పించి, శుక్రవారం అర్ధరాత్రి వరకూ చికిత్స కొనసాగించారు. మరింత మెరుగైన వైద్యం అవసరమని బెంగళూరు నుంచి వెళ్లిన ప్రత్యేక వైద్యబృందం సూచించడంతో, నారాయణ హృదయాలయకు గ్రీన్‌ కారిడార్‌ ద్వారా తరలించారు.

ఇది కూడా చదవండి: TarakaRatna: ఐసీయూలో తారకరత్న.. బయటికొచ్చిన ఫొటో.. చూస్తేనే గుండె తరుక్కుపోతోంది..!

రాత్రి ఒంటిగంట తర్వాత బొమ్మనహళ్లిలోని హృదయాలయకు చేరుకోగా ప్రత్యేక ఐసీయూలో ఆరేడుగురు కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్సలు కొనసాగించారు. కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్ట్‌లు, ఇతర వైద్యనిపుణులు పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తారకరత్న గుండెలో బ్లాక్స్‌ అధికంగా ఉన్నాయి. స్టంట్‌ వేయాలంటే షుగర్‌ సాధారణ స్థితిలో ఉండాలి. కొన్నాళ్లుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ షుగర్‌ టాబ్లెట్స్‌ వేసుకోకపోవడంతో షుగర్‌ లెవల్‌ 400కు చేరింది. ఈ కారణంగా వైద్యులు స్టంట్స్‌ వేయలేకపోయారు.

Updated Date - 2023-01-31T19:49:29+05:30 IST