Nexon EV: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి నెక్సాన్ ఈవీ

ABN , First Publish Date - 2023-03-13T18:40:27+05:30 IST

టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్ నెక్సాన్ ఈవీ (Nexon EV) ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది

Nexon EV: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి నెక్సాన్ ఈవీ

ముంబై: టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్ నెక్సాన్ ఈవీ (Nexon EV) ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. కశ్మీర్(Kashmir) నుంచి కన్యాకుమారి(Kanyakumari) వరకు అత్యంత వేగంగా చేరుకున్న ఈవీగా రికార్డులకెక్కింది. 4003 కిలోమీటర్లను ఇది కేవలం 95 గంటల 46 నిమిషాల్లోనే చేరుకుంది. అంటే నాలుగు రోజుల్లోపే చేరుకుంది. జాతీయ రహదారి మార్గాల్లో ఉన్న మెరుగైన నిరంతరాయ పబ్లిక్ చార్జింగ్ నెట్‌వర్క్ కారణంగానే ఈ నాన్‌స్టాప్ డ్రైవ్ సాధ్యమైంది.

ఈ ట్రిప్‌లో ఫాస్ట్ చార్జింగ్ కోసం 21 స్టాప్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తం ప్రయాణంలో ఐసీఈ (ICE) వాహనంతో పోలిస్తే గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసింది. అలాగే పలు రకాల వాతావరణ పరిస్థితులు, భూభాగాలు ఎదురైనప్పటికీ మామూలు కార్లలానే పరుగులు తీసింది. ఈ అందమైన డ్రైవ్‌ను కంపెనీ సొంత నాయకత్వ బృందం ఆస్వాదించింది. నెక్సాన్ ఈ ప్రయాణంలో వేగవంతమైన కే2కే(K2K) డ్రైవ్‌తోపాటు నెక్సాన్ ఈవీ 23 అదనపు రికార్డులను సృష్టించింది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈవీ ద్వారా అత్యంత వేగవంతమైన కే2కే డ్రైవ్ కోసం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రవేశించడం ద్వారా నెక్సాన్ ఈవీ సామర్థ్యం మరోమారు నిరూపితమైందన్నారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యతకు ఇది నిదర్శనమన్నారు. 75 నుంచి 100 కిలోమీటర్ల మధ్య ఓ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉందని వివరించారు.

Updated Date - 2023-03-13T18:40:27+05:30 IST