రెవెన్యూ డివిజన హామీని విస్మరించిన సీఎం

ABN , First Publish Date - 2023-01-04T00:54:40+05:30 IST

ఆలేరును రెవెన్యూ డివిజనగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఆ హామీని విస్మరించారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ విమర్శించారు.

 రెవెన్యూ డివిజన హామీని విస్మరించిన సీఎం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

ఆలేరు, జనవరి 3: ఆలేరును రెవెన్యూ డివిజనగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఆ హామీని విస్మరించారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ విమర్శించారు. మంగళవారం ఆలేరులో జరిగిన పార్టీ పట్టణ, మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరును రెవెన్యూ డివిజనగా ఏర్పాటుచేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే సీఎంతో మాట్లాడి, హామీని అమలు చేయించాలని డిమాండ్‌ చేశారు. డివిజన ఏర్పాటుతో నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాఽధిస్తుందన్నారు. ఆలేరు మండలంలోని కొలనుపాక, బహద్దూర్‌పేట, మంతపురి గ్రామాల మధ్యన ఉన్న వాగులపై బ్రిడ్డి నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పర్చాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఏ ఇక్బాల్‌, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్‌, మండల నాయకులు సూదగాని సత్యరాజయ్య, మొరిగాడి చంద్రశేఖర్‌, తులసయ్య, మల్లేష్‌, గణేష్‌, బాల్‌రాజ్‌, అజయ్‌, శివ, దాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-04T00:54:43+05:30 IST