Share News

Viral News: భలే వెడ్డింగ్ కార్డ్.. ప్రశ్నా పత్రం రూపంలో పెళ్లి పత్రిక

ABN , First Publish Date - 2023-11-11T16:22:25+05:30 IST

టెక్నాలజీ వచ్చాక యూత్ ఆలోచనల్లో సృజనాత్మకత బయటపడుతోంది. విభిన్న ఆలోచనలతో తాము ఉన్న రంగాల్లోనే కాదు.. వ్యక్తిగత జీవితాలని కూడా వినూత్నంగా మార్చుకుంటున్నారు. వివాహాన్ని మధురానుభూతిగా మార్చుకోవాలనుకునే వారు కొత్త ఐడియాలతో వస్తున్నారు. వెడ్డింగ్ కార్డుల్ని వినూత్నంగా తయారు చేయించండం ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు వెడ్డింగ్ కార్డుని(Wedding Card) విభిన్నంగా డిజైన్ చేయించాడు.

Viral News: భలే వెడ్డింగ్ కార్డ్.. ప్రశ్నా పత్రం రూపంలో పెళ్లి పత్రిక

మెదక్: టెక్నాలజీ వచ్చాక యూత్ ఆలోచనల్లో సృజనాత్మకత బయటపడుతోంది. విభిన్న ఆలోచనలతో తాము ఉన్న రంగాల్లోనే కాదు.. వ్యక్తిగత జీవితాలని కూడా వినూత్నంగా మార్చుకుంటున్నారు. వివాహాన్ని మధురానుభూతిగా మార్చుకోవాలనుకునే వారు కొత్త ఐడియాలతో వస్తున్నారు. వెడ్డింగ్ కార్డుల్ని వినూత్నంగా తయారు చేయించండం ఈ మధ్య ట్రెండ్ అవుతోంది.

తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు వెడ్డింగ్ కార్డుని(Wedding Card) విభిన్నంగా డిజైన్ చేయించాడు. దాన్ని చూసిన ఎవరైనా ఔరా అనక మానరు. ఇంతకు ఆ వెడ్డింగ్ కార్డ్ లో అంత వెరైటీ ఏముందనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.. మెదక్(Medak) జిల్లా కడ్లూర్ గ్రామానికి చెందిన అనిల్ ఈ నెల 19న సిద్దిపేట(Siddipet)లో వివాహం చేసుకోనున్నాడు.


ఇందుకోసం పెళ్లిపత్రికలు అచ్చువేయించడానికి నిర్ణయించుకున్నాడు. అందరిలా సాధారణంగా వెడ్డింగ్ కార్డ్ అచ్చు వేయిస్తే కొత్త ఏముంటుందని భావించాడో ఏమో.. పోటీ పరీక్షల ప్రశ్నల మాదిరిగా పత్రికను అచ్చు వేయించాడు. అందులో "Identify the person in the picture" అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చి.. కరెక్ట్ ఆన్సర్ ని హైలెట్ చేశాడు.

"Match the following invitors with their pairs" అంటూ వివాహానికి ఆహ్వానిస్తున్న జంటల పేర్లను రాసి, భార్య భర్తల జంటలను కలపాలని కోరాడు. వాటితోపాటు "Time of Marriage, Place of Marraige" ఇలా... మొత్తంగా 5 విభాగాల్లో సుమారు 20 వరకు ప్రశ్నలు వేసి.. చూపరులకు ఆసక్తికలిగేలా చేశాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వినూత్నంగా ఆలోచించిన అతనికి నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-11T16:22:27+05:30 IST