Share News

కర్ణాటక మద్యం పట్టివేత

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:30 PM

మండల పరిధిలోని మేళిగనూరు, నదిచాగి గ్రామాల మఽధ్య బండిరస్తా వద్ద శుక్రవారం కర్ణాటక మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మహ్మద్‌ రిజ్వాన తెలిపారు.

కర్ణాటక మద్యం పట్టివేత
మద్యం, బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కౌతాళం, సెప్టెంబరు 6: మండల పరిధిలోని మేళిగనూరు, నదిచాగి గ్రామాల మఽధ్య బండిరస్తా వద్ద శుక్రవారం కర్ణాటక మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మహ్మద్‌ రిజ్వాన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంటకుంట గ్రామానికి చెందిన కుమార్‌, రాఘవేంద్ర మల్లయ్యతో పాటు ఉరుకుంద గ్రామానికి చెందిన ఈడిగ మల్లయ్య, కాత్రికి గ్రామానికి చెందిన మహేంద్ర నాలుగు ద్విచక్ర వాహనాలపై కర్ణాటకలోని మురణి గ్రామం నుంచి 30 బాక్సుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 30 బాక్సుల మద్యంతోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

మద్యం రవాణ కేసులో ఒకరి అరెస్టు

మంత్రాలయం, సెప్టెంబరు 6: మండలంలోని మాధవరం చెక్‌పోస్టు వద్ద కర్ణాటక నుంచి మోటారు సైకిల్‌పై మద్యం తెస్తుండగా.. ఎక్సైజ్‌ సీఐ భార్గవ్‌ రెడ్డి, మాధవరం చెక్‌పోస్టు ఎస్‌ఐ వీరస్వామి దాడులు చేసి పట్టుకున్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన గరీబ్‌ మహ్మద్‌ ఆల్తాఫ్‌, కర్ణాటకలోని రాయచూరు చెందిన వినోద్‌, ఎమ్మిగనూరు చెందిన వినోద్‌, మమత అనే వ్యక్తులు మద్యం తెస్తుండగా పట్టుకున్నారు. రెండు చోట్ల వేర్వేరు సమయాల్లో ముగ్గురుని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న బైక్‌ను సీజ్‌ చేసి ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని ఎమ్మిగనూరు కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించామన్నారు. వారి వద్దనున్న 672 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 06 , 2024 | 11:30 PM