BIG DEBATE: చివరకు రాజశేఖరరెడ్డికి సైతం అలాంటి పరిస్థితే ఎదురైంది
ABN , Publish Date - May 08 , 2024 | 09:24 PM
ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఓడిపోతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అతడు మళ్లీ వస్తాడని జీరో పర్సెంట్ కూడా లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబెట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధాన మిచ్చారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఓడిపోతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అతడు మళ్లీ వస్తాడని జీరో పర్సెంట్ కూడా నమ్మకం లేదని అన్నారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబెట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధాన మిచ్చారు. అయితే గత ఎన్నికల వేళ... ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ 25కి 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే.. మోదీ మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తెస్తామని ప్రచారం చేశారని ఆర్కే గుర్తు చేయగా చంద్రబాబు స్పందించారు.
Thatikonda Rajaiah: కడియం శ్రీహరి నకిలీ దళితుడు
వైయస్ జగన్ మెడలు వంచడు కానీ.. మోదీ కాళ్లు పట్టుకుని తనపైన ఉన్న కేసులు మాఫీ చేసుకుంటాడని చంద్రబాబు విమర్శించారు. ఇవన్నీ రాష్ట్రం కోసం కాదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి డ్రామాలు అవసరం లేదన్నారు. తాను డ్రామాలు చేయబోనని, అలాంటివి తనకు తెలియదని బాబు పేర్కొన్నారు.
వైయస్ జగన్ నైజం అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లుగా ఉంటుందని చంద్రబాబు అభివర్ణించారు. ఇది రాజకీయాల్లో సబబు కాదని, జగన్‌ది నార్సిజమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘ మొన్న ఏమన్నాడు.. నా వెంటుక్ర కూడా పీకలేరన్నారు. ఇప్పుడే మంటున్నాడు నన్ను పీకేస్తున్నారంటున్నాడు. అప్పటికి ఇప్పటికి అంత వ్యత్యాసం వచ్చిందంటే.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగా.. ఈ ఎన్నికల్లో సైతం మొత్తం జగనే ఓట్లు వేసుకోవాలనుకున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Delhi's Ram Manohar Lohia: ఆసుపత్రిలో అవినీతి.. 9 మంది అరెస్ట్
నాడు ఎలక్షన్ కమిషన్‌ను సైతం వైయస్ జగన్ ఇబ్బందులకు గురి చేశారని... దీంతో తన భద్రత కోసం ఢిల్లీ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని ఈ సందర్బంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఇక ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారన్నారు. అలాగే జగన్ పాలనలో ఎంతో మంది భయంకరంగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు ఉదాహరించారు.
CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?
అయితే ఎన్జీవోలకు ముఖ్యమంత్రులు సైతం భయపడిన సందర్భాలు రాష్ట్రంలో కోకోల్లలుగా ఉన్నాయన్నారు. చివరకు రాజశేఖర్ రెడ్డికి సైతం అలాంటి పరిస్థితే ఎదరైందని గుర్తు చేశారు. కానీ నేడు వైయస్ జగన హయాంలో ఎన్జీవోస్ సైతం నోరు విప్పలేని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ వైయస్ జగన్ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించేందుకు పీఆర్సీ వేస్తాడంటూ చంద్రబాబు చమత్కరించారు.
Read Latest National News and Telugu News