Share News

Allu Arjun: పుష్ప వస్తాడా..? రాడా..?

ABN , Publish Date - Jun 11 , 2024 | 08:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలందాయి.

Allu Arjun: పుష్ప వస్తాడా..? రాడా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలందాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సైతం ఆహ్వానాలు వెళ్లాయి. చిరంజీవితో పాటు ఆయన కుమారుడు హీరో రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది.


అయితే ఈ కార్యక్రమానికి పుష్ప హీరో అల్లు అర్జున్ హాజరవుతాడా? లేదా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అల్లు అర్జున్ మేనమామ జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బరిలో నిలిచారు. ఆయన విజయం కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం నిర్వహించింది. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ప్రచారం నిర్వహించలేదు. పైగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి‌కి మద్దతు తెలిపాడు. ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మద్దతు తెలిపి వచ్చారు.


పవన్ గెలుపునకు ప్రత్యక్షంగా మద్దతు తెలిపని అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థికి ప్రత్యక్షంగా మద్దతు తెలపడంపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌పై దుమ్మెత్తిపోశారు. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది.


దీనిపై జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అంటూ చర్చ నడిచింది. ఈ ఎఫెక్ట్‌తో నాగబాబు సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయినప్పటికీ.. మెగా, అల్లు అర్జున్ మద్య కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ నడుస్తోంది.


ఇక ఎ న్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించడం.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాలను కైవశం చేసుకోవడం జరిగిపోయాయి. దీంతో చంద్రబాబు కేబినెట్‌లో పవన్ కల్యాణ్ కీలక మంత్రి పదవి దక్కడం ఖాయమైందని తెలుస్తోంది.

దీంతో మెగా ఫ్యామిలీ అంతా.. జూన్ 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతుందని తెలుస్తుంది. అలాంటి వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప‌ సినిమాలో డైలాగ్‌ ఎక్కడ తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరించి.. ఈ కార్యక్రమానికి డుమ్మా కొడతాడా? లేకుంటే.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అన్నట్లుగా వ్యవహరించి.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతాడా? అని పుష్ప హీరో ఫ్యాన్స్‌లో ఓ చర్చ అయితే వైరల్ అవుతుంది.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 08:44 PM