Anagani Satya Prasad: తల్లి చెల్లిని వదలని.. జగన్‌పై మంత్రి అనగాని
ABN , Publish Date - Nov 07 , 2024 | 07:12 PM
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
అమరావతి, నవంబర్ 07: కళ్లుండి చూడలేని కబోధిలా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై 25 శాతం మేర నేరాలు తగ్గాయని గురువారం అమరావతిలో ఆయన వివరించారు. మరి ఈ విషయం కనిపించడం లేదా? అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మంత్రి అనగాని సత్య ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు.
Also Read: Teenmar Mallanna: ఎన్నికల్లో చిచ్చు పెట్టేందుకే..
ఇది వాస్తవం కాదా..
మీ పాలనలో ప్రతి 8 గంటలకు ఒక రేప్, ప్రతి గంటకు ఇద్దరు మహిళలపై లైంగిక దాడులు జరిగేవని గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదా జగన్? అంటూ మంత్రి అనగాని బల్లగుద్ది ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేయడంలో నిన్ను మించిన వాడు ప్రపంచంలోనే లేడంటూ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. చివరకు తల్లిని, చెల్లిని సైతం ఈ జగన్ రెడ్డి వదల లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అసభ్య పోస్టింగులు, సమాజాన్ని విధ్వంసం చేసే పోస్టులు పెట్టిన వారిని చట్టబద్దంగా అరెస్ట్ చేయడం చీకటి రోజులైతే... నీ పాలనలో పెట్టిన వేల కొద్ది అక్రమ కేసులను ఏమనాలి? జగన్ రెడ్డి అంటూ మంత్రి అనగాని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలను నరికి చంపించిన నీవు శాంతిభద్రతలు గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అభివర్ణించారు.
Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు
ఇంతకీ ఏం జరిగిందంటే..
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత వంగలపూడి అనితతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా వైసీపీలోని సోషల్ మీడియా విభాగంలోని పలువురు తీవ్ర అభ్యంతరకర పోస్టులు చేశారు. అలాగే వైఎస్ జగన్ కన్నతల్లి వైఎస్ విజయమ్మ, సోదరిలు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై ఇదే తరహాలో పోస్టులు సైతం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై గతంలో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.
Also Read: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
వర్రా రవీందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని.. అంతలోనే వదిలేసిన పోలీసులు...
ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. దీంతో మంగళవారం అతడిని కడపలోని చిన్న చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోన్నారు. దీంతో వర్రా రవీందర్ రెడ్డిని విడిచి పెట్టారు. అయితే అప్పటికే అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రొద్దుటూరు పోలీసలు చిన్న చౌక్ పీఎస్‌కు చేరుకున్నారు.
Also Read: రేవంత్ ఉడుత ఊపులకు అదర బెదర
వెంటనే స్పందించిన ప్రభుత్వం..
కానీ అప్పటికే రవీందర్ రెడ్డిని విడుదల చేయడంతో.. వారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దాంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అందులోభాగంగా కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు చిన్న చౌక్ పీఎస్ సీఐపై బదిలీ వేటు వేశారు.
Also Read: రోజమ్మ నీకో న్యాయం..మాకో న్యాయమా ..!
జగన్ వ్యాఖ్యలు.. స్పందించిన మంత్రి అనగాని..
ఈ మొత్తం ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని శాంతి భద్రతలు తదితర అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ పైవిధంగా మాట్లాడారు.
Also Read: పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలా..?
For AndhraPradesh News And Telugu News..