-
-
Home » Andhra Pradesh » AP Budget 2024 was presented in AP Assembly by Finance minister Buggana Rajendranath live updates psnr
-
AP Budget 2024 Live Updates: రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,30,110 కోట్లు.. ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
ABN , First Publish Date - Feb 07 , 2024 | 11:45 AM
ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
Live News & Update
-
2024-02-07T13:05:48+05:30
-
2024-02-07T12:48:33+05:30
తలసరి ఆదాయం రూ.2,19,518లతో దేశంలోనే 9 ర్యాంకులో ఏపీ నిలిచింది
ఐదేళ్ల కాలంలో 30 లక్షల పైచిలుకు ఇళ్లపట్టాల పంపిణీ చేసి సంక్షేమాంధ్రగా ఏపీని మార్చాం
నగదు బదిలీ ద్వారా 2.53 లక్షల కోట్లను పంపిణీ చేశాం
పెన్షన్ కానుక ద్వారా 84 వేల కోట్లను అందించాం
ఐదేళ్లలో ప్రజాపంపిణీలో ఇంటి ముందుకే సరుకులను పంపేలా సంచార పంపిణీ వాహనాలు ప్రవేశపెట్టాం. తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కూడా దొరికింది.
5 ఏళ్లుగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్లు ఖర్చు చేశాం
2019 వరకూ రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా వైసీపీ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలను నిర్మించింది
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రాధాన్యాతా క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం
-
2024-02-07T12:26:04+05:30
ఆర్థిక మంత్రి బుగ్గన కామెంట్స్..
ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం
2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలను స్థాపించాం
తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వాహబ్‌గా తయారైంది.
10,778 రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశాం
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది
వైద్యారోగ్య రంగంలో ‘నాడు నేడు’ పథకం అమలు చేశాం
ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ రూ.16,852 కోట్లు వ్యయం చేశాం
53.58 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్ల మేర రైతు భరోసా ఆర్థిక సాయం అందించాం.
-
2024-02-07T12:20:40+05:30
కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశాం.
అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశాం.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రూ.2358 కోట్లతో పనులు చేపట్టాం.
సామర్థ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం.
-
2024-02-07T12:15:55+05:30
ఏపీ అసెంబ్లీలో బుగ్గన ప్రసంగం
ఫ్యామిలీ డాక్టర్ సేవలు ప్రారంభించాం
2,284 మంది వైద్యులతో సేవలు అందిస్తున్నాం.
22 లక్షల ఇళ్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వం లక్ష్యం
-
2024-02-07T12:01:40+05:30
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,05,352 కోట్ల రెవన్యూ రాబడి వస్తుందని బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది.
కేంద్ర పన్నుల ద్వారా రూ. 49,286 కోట్ల రాబడి వస్తుందని అంచనా.
రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని అంచనా.
పన్నేతర ఆదాయంగా రూ.14,400 కోట్లుగా అంచనా.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని అంచనా.
బహిరంగ మార్కెట్ ద్వారా రూ.71 వేల కోట్లను రుణ సేకరణ చేయాలని ప్రభుత్వ లక్ష్యం.
కేంద్రం నుంచి రూ.61,642 కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచన.
ఇతర మార్గాల ద్వారా మరో రూ.25 వేల కోట్ల అప్పు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదన
-
2024-02-07T11:51:10+05:30
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కామెంట్స్...
‘‘ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. రాష్ట్ర సమస్యల్ని పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించాం. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా మా ప్రభుత్వ చర్యలు తీసుకుంది. పాలనా విభాగాలను పునర్‌వ్యవస్థీకరించి అన్ని వర్గాల వారికీ సాధికారిత అందించాం. విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్థులను సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకొచ్చాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారింది’’
-
2024-02-07T11:35:32+05:30
బడ్జెట్ ముఖ్యాంశాలు...
రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం
రూ.30,530 కోట్ల మూలధన వ్యయం
రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు
రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు అంచనా
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం మేర ద్రవ్యలోటు
జీఎస్‌డీపీలో 1.56 శాతం మేర రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా.
-
2024-02-07T11:30:28+05:30
ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఏపీని సంపన్న ఆంధ్రగా మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు.