Share News

AP Elections: గెలుపుపై గ్యారంటీ లేక జిత్తులమారి వేషాలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 08:26 PM

మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ఏం చేయాలి.. ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్లో ఓటర్లను కన్ఫ్యూజ్ చేయ్యాలి.... అదీ కూడా టోటల్‌గా వారిని కన్ప్యూజ్ చేసి పారేయాలి. అలా అయితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలం. అదీకూడా ప్రజాస్వామ్య బద్దంగా.. అధికారన్ని అందుకోగలం.

AP Elections: గెలుపుపై గ్యారంటీ లేక జిత్తులమారి వేషాలు

మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ఏం చేయాలి.. ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్లో ఓటర్లను కన్ఫ్యూజ్ చేయ్యాలి.... అదీ కూడా టోటల్‌గా వారిని కన్ప్యూజ్ చేసి పారేయాలి. అలా అయితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలం. అదీకూడా ప్రజాస్వామ్య బద్దంగా.. అధికారన్ని అందుకోగలం.

AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?

ఆ క్రతువుకే పలు రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాయి. అంటే.. ఒకే పేరున్న అభ్యర్థులు.. నలుగురు, అయిదుగురు ఎన్నికల బరిలో దిగుతారు. దీంతో పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు వెళ్లిన సామాన్య ఓటరు.. కొన్ని నిమిషాల పాటు అభ్యర్థి పేర్లన్ని ఒకేలా ఉన్నాయంటూ.. గుర్తులను వెతికే పనిలో పడతాడు. తుదకు ఇదంతా ఎందుకొచ్చిన గోల.. అనుకుంటూ.. గత ఎమ్మెల్యే క్యాండిట్‌కే మళ్లీ ఓటు వేస్తే పోలా.. అనే స్థితికి వచ్చేస్తాడు. దీంతో గత ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి ఆటోమెటిక్‌గా కొలువు తీరుతుంది.


గతంలో ఈ పరిస్థితి ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనిపించేది. కానీ నేడు ఆ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా.. అంటే ప్రముఖ అభ్యర్థులు బరిలో దిగిన స్థానాల్లో ఆ ఫార్మూలాను రాజకీయ పార్టీలు అమలు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి.

AP Elections : పిఠాపురానికి కడప రౌడీలు

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు పవన్ కల్యాణ్‌ పేరుతో బరిలో నిలిచినట్లు ఓ ప్రచారం అయితే నడుస్తుంది.

AP Elections: హైదరాబాద్‌లో ఆంధ్ర ఓటర్ల కోసం.. క్యూ కడుతున్న నేతలు

ఇక ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక అదే నియోజకవర్గం నుంచి బోయిన బుద్ద ప్రసాద్ బరిలో నిలిచారు. నామినేషన్ చివరి రోజు... ఆయన నామినేషన్ దాఖలు చేయడం విశేషం.


ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి విడదల రజినీ అనే మహిళ నామినేషన్ చివరి రోజు.. నామినేషన్ వేసేందుకు యత్నించారు. ఆ క్రమంలో ఆమెను దుండగులు కిడ్నాప్‌ చేశారు. తన భార్యను కారులో దుండగులు తీసుకువెళ్లారంటూ ఆమె భర్త రాఘవరావు ఆరోపించారు.

AP Elections 2024: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్..

వైసీపీ అభ్యర్థి పేరుతో ఉన్న మహిళను నామినేషన్ వేయకుండా అధికార వైసీపీ ఇటువంటి చర్యలకు శ్రీకారం చుట్టిందంటూ ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. అయితే మహిళ ఆచూకీ కనుగొనాలంటూ దళిత సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల నామినేషన్ల పర్వానికి ఆఖరి రోజు అంటే.. గురువారం.


ఈ నేపథ్యంలో నామినేషన్ల సమయం పూర్తి అయిన తర్వాత.. ఈ సామాన్య మహిళ విడదల రజినీని వదిలివేసి ఉంటారనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది. ఎందుకంటే.. ఒకే పేరుతో పలువురు అభ్యర్థులు ఉంటే.. ఓటర్ కన్ప్యూజ్ అయి.. ఆ కన్ప్యూజన్‌లో ఏవరో ఒకరికి ఓటు పడిపోతుంది. దీంతో ఓట్లు చీలి... మళ్లీ అధికారం హస్తగతం చేసుకొనేందుకు ఇదో పక్కా ప్రణాళిక అనేది సుస్పష్టం.

ఏదీ ఏమైనా 2009 ఎన్నికల నాటి నుంచి ఒకే అభ్యర్థి పేరుతో పలువురు అభ్యర్థుల బరిలో దిగే జాతర.. నాటి నుంచి మొదలైందని ప్రజాస్వామిక వాదులు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో రాజకీయ పార్టీలు చాలా వడుపుగా ఓట్లు దండుకొని అధికారాన్ని అందుకొంటున్నాయని వారు ఓ ఆవేదనతో కూడిన ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

Read National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 08:26 PM