Share News

PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన

ABN , Publish Date - May 05 , 2024 | 01:24 PM

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భూ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు.

PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
చంద్రబాబు, అమిత్ షా

అనంతపురం, మే 05: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. అలాంటి పోలవరం ప్రాజెక్ట్‌పై ధర్మవరం వేదికగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ప్రజాగళం సభలో భాగంగా ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సభలో కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం తీరుపై అమిత్ షా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ అవినీతి వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అలస్యమైందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని రాజధాని చేస్తామన్నారు.

Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్


అవినీతికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భూ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని అమిత్ షా విమర్శించారు. ఈ జగన్ ప్రభుత్వం తెలుగు భాషను అణగదొక్కుతుందన్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియంను బలవంతంగా రుద్దుతుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందో అమిత్ షా ఈ సందర్భంగా వివరించారు.

రాష్ట్రంలో మాఫియా ఆగడాలను అరికట్టేందుకు.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు.. ఏపీలో గుండాయిజం, నేరస్థులను అరికట్టేందుకే పొత్తు పెట్టుకున్నట్లు అమిత్ షా వివరించారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరనుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 లోక్‌సభ స్థానాలు వస్తాయన్నారు. అలాగే ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరుతుందన్నారు.

Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....


ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత తమదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని.. అలాగే హంద్రీ నీవా ప్రాజెక్ట్ సైతం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Ayodhya: నేడు అయోధ్యకి ప్రధాని మోదీ.. అఖిలేష్ టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల ప్రచారం

అమరావతిని నాశనం చేసిన జగన్‌ను ఇంటికి పంపాలని చంద్రబాబు ఈ సభ వేదిక మీద నుంచి ప్రజలకు పిలుపునిచ్చారు. అదే విధంగా రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్దంగా ఉండాలన్నారు. దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. ప్రధాని మోదీయేనని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

For Latest News and National News click here

Updated Date - May 05 , 2024 | 02:57 PM