AP CM ChandraBabu: పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం
ABN , Publish Date - Jun 14 , 2024 | 08:03 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు.
అమరావతి, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు. శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై ఆ యా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆ క్రమంలో రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు.
Also Read: Gajuwaka MLA: ఎవరీ పల్లా శ్రీనివాసరావు?
పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా అధికారులను ఆయన ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులోభాగంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ సైతం దర్శించేవారు.
Also Read: Vangalapudi Anitha: హోం శాఖే ఎందుకు..?
Also Read: Gajuwaka MLA: ఎవరీ పల్లా శ్రీనివాసరావు?
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చారు. ఆ తర్వాత సదరు ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత వరకు వచ్చింది... నిర్మాణం ఏ దశలో ఉందో చెప్పే వారే జగన్ ప్రభుత్వంలో కరువయ్యారు.
Also Read: Telangana: యూనిట్లు 294.. కరంట్ బిల్లు రూ. 29 కోట్లు
ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు.. కూటమికి పట్టం కట్టారు. అదీకాక.. ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి, రాజధాని అమరావతి నిర్మాణానికి సహయ సహకారాలందిస్తామని ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.