వరద ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలు వాయిదా: సీఎం
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:31 AM
వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మత్తులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని నిర్ణయించాం. ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని అనుకొంటున్నాం. వాహనాల రిపేర్లు, ఎలకా్ట్రనిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్‌ల రిపేర్లు... ఇలా ఏ రిపేర్‌కు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందించేవారితో కూడా మాట్లాడుతున్నాం. ఫైర్ ఇంజన్లు ఈ రోజు ఐదు వేల ఇళ్ళు శుభ్రం చేశాయి.