ట్రంప్ గెలుపుపై సీఎం చంద్రబాబు హర్షం
ABN , Publish Date - Nov 07 , 2024 | 04:48 AM
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
భారత్-యూఎ్‌స సంబంధాలు బలోపేతం
ట్రంప్, మోదీ నాయకత్వంలో ఇరుదేశాల అభివృద్ధి
ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి, రాజంపేట, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ గెలుపుతో భారత్-అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ట్రంప్ నేతృత్వంలో అమెరికా అభివృద్ధి చెందుతుంద ంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ, ట్రంప్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య బంధాలు బలపడి పరస్పర సహకారంతో అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. కాగా, ట్రంప్‌కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాల్లో కొత్త శకానికి నాంది అన్నారు.
సతీష్ వేమన హర్షం
ట్రంప్ విజయంపై ‘తానా’ పూర్వ అధ్యక్షుడు సతీష్ వేమన హర్షం వెలిబుచ్చారు. ట్రంప్ విజయం వెనుక భారతీయ ప్రముఖుల కృషి ఉందని తెలిపారు. ట్రంప్ ఎన్నికతో అమెరికా-భారత్ పరస్పరం సోదర భావంతో కొనసాగుతాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సతీష్ వేమన నేతృత్వంలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలంగా సమర్థించారు.