CM ChandraBabu: కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Oct 04 , 2024 | 04:58 PM
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు.
తిరుపతి, అక్టోబర్ 04: తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు. అయితే ఈ విమానం అనుకున్న సమయాని కంటే.. దాదాపు 30 నిమిషాలు ముందే బయలుదేరింది. దీంతో సీఎం చంద్రబాబు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే చంద్రబాబు బస చేయనున్నారు. ఇక శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం పెద్ద శేష వాహనంలో స్వామి వారి ఉత్సవంలో సీఎం పాల్గొనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి పయనమవ్వనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం దాదాపు మూడు నెలల కిత్రం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో సీఎం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారిగా కులదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో లడ్డూకి పరీక్షలు నిర్వహించగా.. కల్తీ జరిగినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరపాలని నిర్ణయించారు. అందులోభాగంగా సర్వ శ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై టీటీడీ బోర్డ్ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దాంతో ఈ వ్యవహారంపై జస్టిస్ బీ ఆర్ గవాయ్, కే.వీ. విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఆ క్రమంలో శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. ఈ స్వతంత్ర్య దర్యాప్తు సిట్‌ను సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
For More AndhraPradesh News and Telugu News