Share News

ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:54 AM

వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల నష్టపరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ నందికొట్కూరు మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి ఏఈవో పార్వతమ్మకు, నందికొట్కూరు తహసీల్దార్‌ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు.

ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి
నందికొట్కూరు మండల ఏఈవో పార్వతమ్మకు వినతి పత్రం అందజేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు

నందికొట్కూరు రూరల్‌, సెప్టెంబరు 3: వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల నష్టపరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ నందికొట్కూరు మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి ఏఈవో పార్వతమ్మకు, నందికొట్కూరు తహసీల్దార్‌ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు నందికొట్కూరు మండలం, జూపాడుబంగ్లా, మిడుతూరు, పగిడ్యాల మండలాల లోని వివిధ గ్రామాలలో పంట పొలాలు నీటమునిగి దెబ్బతిన్నాయన్నారు. మొక్కజొన్న, కంది, మినుము, సోయాబిన, వేరుశనగ, ఉల్లి, మిరప, కొర్ర, ముఖ్యంగా పచ్చిమిర్చి పంటల్లోకి వర్షపునీరు చేరి పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. నష్టపరిహారం అంచనాలు తయారు చేసి, నష్టపోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం త్వరితగతిన అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో భాస్కర్‌గౌడు, రామక్రిష్ణ, శివనన్న, సోమన్న, సిద్దు, క్రిష్ణ, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 12:54 AM