Share News

జలాశయానికి కొనసాగుతున్న ఇనఫ్లో

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:54 PM

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.

జలాశయానికి కొనసాగుతున్న ఇనఫ్లో

శ్రీశైలం, సెప్టెంబరు 6: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం జలాశయానికి ఇనఫ్లో పెరగడంతో డ్యాం అధికారులు జలాశయం ఆరు క్రస్టుగేట్లను తెరిచి దిగువ నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి 1,43,802 క్యూసెక్కులు, సుకేసుల నుంచి 20,196 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు మొత్తం 1,64,432 వరద వస్తోంది. జలాశయం ఆరు క్రస్టు గేట్లు ఎత్తి 1,67,076 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయానికి 1,49,435 క్యూసెక్కుల వరద వచ్చింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా నమోదైంది.

Updated Date - Sep 06 , 2024 | 11:54 PM