Amaravati : డీసీసీబీ, డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జిలుగా జేసీలు
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:09 AM
రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ)లు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎ్‌స)లకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను పర్సన్ ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం నియమించింది
ఆప్కాబ్ పర్సన్ ఇన్‌చార్జిగా అహ్మద్‌బాబు
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ)లు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎ్‌స)లకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను పర్సన్ ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 డీసీసీబీలు, 13 డీసీఎంఎ్‌సలకు గత ప్రభుత్వం నియమించిన ఏడుగురు సభ్యుల పాలకవర్గాలు రాజీనామా చేశాయి. ప్రస్తుత ప్ర భుత్వం ఆరు నెలల కాల పరిమితితో జేసీలను అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించింది. ఆప్కాబ్ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి మ ల్లెల ఝాన్సీరాణి రాజీనామా చేయడంతో ఆప్కాబ్ పర్సన్ ఇన్‌చార్జిగా రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ర్టార్ అహ్మద్‌బాబును తాజాగా నియమించింది.
శేఖర్‌బాబుకు మార్కెటింగ్ బాధ్యతలు
మార్క్‌ఫెడ్ ఎండీ గడ్డం శేఖర్‌బాబుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెటింగ్ శాఖ పరిధిలోని రైతుబజార్ల ఇన్‌చార్జి సీఈవోగా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించింది.