Share News

గణేశ ఉత్సవాలను విజయవంతంగా చేయండి

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:32 PM

గణేశ ఉత్సవాలన విజయవంతంగా చేపట్టాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు.

గణేశ ఉత్సవాలను విజయవంతంగా చేయండి
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని/ఆదోనిరూరల్‌ సెప్టెంబరు 6 : గణేశ ఉత్సవాలన విజయవంతంగా చేపట్టాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. శుక్రవారం ఎల్‌ఎల్‌సీ వినాయక ఘాటు వద్ద గణేశ ఉత్సవ కమిటీ సభ్యలు, డివిజన స్థాయి సంబంధిత అధికారులతో గణేశ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ శనివారం జరిగే వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. ఆదోని పట్టణంలో 11న జరిగే నిమజ్జనం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. గణేశ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత, లైటింగ్‌, శానిటేషన, ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నిమజ్జనం వెళ్లే రోడ్డులో ఏదైన గుంతలు ఉంటే వాటిని గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశించారు. నిమజ్జనం దగ్గర గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో క్రేన్లు అందుబాటులో ఉంచాలన్నారు. నిమజ్జనానికి పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని డీఎస్పీకు ఆదేశించారు. నిమజ్జనం ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీంచారు. కార్యక్రమంలో డీఎ్‌సపీ సోమన్న, ట్రైనీ డీఎస్పీ ధీరజ్‌, తహసీల్దార్‌ శివరాముడు, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, డీఎల్పివో నూర్జహాన, మోటార్‌ వెహికల్‌ ఇనస్పెక్టర్‌ సీసీర దీప్తి, డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 11:32 PM