Share News

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

ABN , Publish Date - May 13 , 2024 | 04:21 PM

వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

విజయవాడ, మే 13: వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి. అయితే రాష్ట్ర మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్.. తన అనుచరగణంతో పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరులోని పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు.

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు


ఆయనతో పాటు పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు భారీగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ శ్రేణులు సైతం పోలింగ్ జరుగుతున్న ఉప్పులూరు ప్రాథమిక పాఠశాల వద్ద భారీగా చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి... ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించారు.

LokSabha Elections: ఓ వైపు పుట్టిన రోజు.. మరో వైపు ఎన్నికలు

పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి జోగి రమేష్ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జోగి రమేష్.. పెడన నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం సీఎం వైయస్ జగన్ తన రెండోసారి చేసిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జోగి రమేష్‌కు గృహ నిర్మాణ శాఖకు కేటాయించారు.


అయితే జోగి రమేష్ స్వగ్రామం మైలవరం నియోజకవర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి జోగి రమేష్.. మైలవరం కేంద్రంగా రాజకీయం చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో నాటి వైసీపీ నాయకుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మధ్య అధిపత్య పోరు గట్టిగానే నడించింది. అయితే ఎన్నికల ముందు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు.

Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..

మరోవైపు గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారథి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల ముందు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీలో చేరారు. దీంతో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్ పేరును ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ఖరారు చేశారు. దాంతో జోగి రమేష్.. పెనమలూరు ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 13 , 2024 | 04:23 PM