Share News

ఉమాను వెనుకేసుకొస్తున్నావా?

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:33 AM

‘‘గులకరాయి ఘటనలో మీ పార్టీ నేతలను వెనుకేసుకువస్తున్నావా? ఉమాను వెనకేసుకొస్తున్నావా? టీడీపీ నాయకులు ఎవరైనా గులకరాయి వేయమన్నారా? వారు ఎవరైనా దీని వెనుక ఉన్నారా?’

ఉమాను వెనుకేసుకొస్తున్నావా?

  • గులకరాయిని టీడీపీ నేతలు వేయమన్నారా?

  • పోలీసులు పదేపదే ఒత్తిడి చేశారన్న దుర్గారావు

  • రెండు రోజులపాటు కొట్టారు

  • తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు

  • ఆధారాలేవీ దొరక్కపోవడంతో వదిలేశారు

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’కి దుర్గారావు వెల్లడి

విజయవాడ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘గులకరాయి ఘటనలో మీ పార్టీ నేతలను వెనుకేసుకువస్తున్నావా? ఉమాను వెనకేసుకొస్తున్నావా? టీడీపీ నాయకులు ఎవరైనా గులకరాయి వేయమన్నారా? వారు ఎవరైనా దీని వెనుక ఉన్నారా?’’ అంటూ పోలీసులు తనను రెండురోజులుపాటు ఒత్తిడికి గురిచేశారని, కొట్టారని వేముల దుర్గారావు తెలిపారు. విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా పేరు పదేపదే పోలీసులు ప్రస్తావించారన్నారు. గులకరాయి కేసుతో తనకు సంబంధం లేదన్నా వినలేదన్నారు. ‘‘రెండు రోజులపాటు తమ అదుపులో ఉంచుకుని కొట్టారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో వదిలేశారు’’ అని తెలిపారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. ‘‘ఈనెల 16న సాయంత్రం 5.30 గంటలకు డాబాకొట్లు సెంటర్‌లోని టీ స్టాల్‌ దగ్గర ఆటో పెట్టుకుని కూర్చున్నాను. సివిల్‌ పోలీసులు వచ్చి నన్ను వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌పైన ఉన్న సీసీఎ్‌సకు తీసుకెళ్లారు.

సీఎం జగన్‌పై దాడి చేయించింది నువ్వే కదా అని అడిగారు. 100ప్రశ్నలు వేశారు. నేను రాయి వేయించలేదని చెప్పాను. వేముల సతీశ్‌ను ఒత్తిడికి గురిచేసి బలవంతంగా నా పేరు చెప్పించారు. నన్ను అరెస్టు చేయడానికి పది గంటలకు ముందు సతీ్‌షను తీసుకెళ్లారు. రాయి వేయమని నేను ఎవరికీ చెప్పలేదు. నువ్వు టీడీపీలో తిరుగుతున్నావా అని అడిగితే అవునన్నాను. టీడీపీ నాయకులు ఎవరైనా వేయమన్నారా అని ప్రశ్నించారు. నేను వేయమని చెప్పలేదు కాబట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. పోలీసులు విచారణ చేసుకుని, ఏ తప్పూ చేయలేదని అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ దగ్గర శనివారం రాత్రి అప్పగించారు. వారు నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు. నాతో, మా అమ్మ, భార్యతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఫారం 60 నోటీసుపై సంతకాలు పెట్టించుకున్నారు. అవసరమైతే స్టేషన్‌కు రావాలన్నారు’’ అని చెప్పారు.

Updated Date - Apr 22 , 2024 | 09:18 AM