Share News

కనకదుర్గమ్మ కథల మధ్య ‘పురాణపండ’ గ్రంథ సౌందర్యాన్ని పంచిన మహాసహస్రావధాని పద్మాకర్

ABN , Publish Date - Aug 03 , 2024 | 11:35 PM

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యద్భుతంగా జరిగిన మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ ‘శ్రీదుర్గా వైభవం’ ఉపన్యాసాలలో, అనంతరం జరిగిన నృత్యవైభవాలలో ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేకసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రం’ గ్రంధాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

కనకదుర్గమ్మ కథల మధ్య ‘పురాణపండ’ గ్రంథ సౌందర్యాన్ని పంచిన మహాసహస్రావధాని పద్మాకర్

విజయవాడ, ఆగస్ట్ 3: శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యద్భుతంగా జరిగిన మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ ‘శ్రీదుర్గా వైభవం’ ఉపన్యాసాలలో, అనంతరం జరిగిన నృత్యవైభవాలలో ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేకసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రం’ గ్రంధాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Lalitha-Vishnu.jpg

అనుష్ఠానంలో ఉన్నవారికి సుపరిచితాలైన శ్రీ విద్య, శ్రీ స్తోత్ర, శ్రీయంత్ర, శ్రీమంత్ర తదితర అంశాలను పద్మాకర్ సోదాహరణ కథలతో అద్భుతంగా వివరించి భక్త జనుల్ని ఆకట్టుకోవడం గమనార్హం.

Kesineni-Chinni.jpg

ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల అతిధులకు, నాట్యకారిణులకు వద్దిపర్తి పద్మాకర్ బహూకరించిన పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత రచనా సంకలనం ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రం’ ఆడిటోరియంలో భక్తజనుల్ని సైతం భక్తి రసాత్మకంగా ఆకట్టుకోవడం సంతోషపరిచిందని దుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు అభిప్రాయపడ్డారు.

Padmakar.jpg

పురాణపండ శ్రీనివాస్ భక్తి గ్రంధాల పరవశం ఇప్పటికే తిరుమల, యాదాద్రి, ఇంద్రకీలాద్రి, కాణిపాకం, భద్రాచలం, శ్రీశైలం వంటి అనేక మహా క్షేత్రాల్లో వేలాదిమంది భక్తులకు చేరి జేజేలు స్వీకరిస్తున్నాయి.

Padmakar-2.jpg

గత రెండువారాలుగా శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు పేరుతో సుమారు మూడువందల పై చిలుకు పేజీల గ్రంధం అనేక మహా క్షేత్రాల్లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

Padmakar-3.jpg

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ రామారావు సమర్పణలో గత మాసంలో విఖ్యాత ప్రవచనకారులు, మహాసరస్వతీ పుత్రులు చాగంటి కోటేశ్వరరావు కనదుర్గాదేవస్ధాన ప్రత్యేక వేదికపై ఆవిష్కరించిన ‘దుర్గే ప్రసీద’ పవిత్ర మహా గ్రంధం కూడా పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలన వైభవమే!

EO-Ramarao.jpg

ఈ గ్రంధంపై చాగంటి కురిపించిన వాత్సల్యం, పవిత్ర భాష్యం పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలన వైభవ సౌందర్యాలకు కనకదుర్గమ్మ అనుగ్రహమేనంటున్నారు దుర్గమ్మ దేవాలయ అర్చక పండితులు.

Eo-Ramarao-2.jpg

ఏది ఏమైనా పురాణపండ శ్రీనివాస్ వైభవోజ్వల గ్రంధాలను పండితులే స్వయంగా తమ ప్రవచనాలల్లో పంచడం శ్రీ శ్యామలాదేవి కారుణ్యంగానే భావించాలనంటున్నారు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ రామారావు.

Padmakar-4.jpg

అంతే కాకుండా అన్నదానం పధకానికి విరాళమిచ్చిన దాతలకు రశీదుతోపాటు సైతం పురాణపండ గ్రంధాలనే అమ్మవారి అనుగ్రహంగా అందించిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ రామారావుకు దాతలు కృతజ్ఞతలు చెప్పడం ప్రత్యేకం.

Updated Date - Aug 04 , 2024 | 01:47 AM