Share News

'Sitaram' : మణిమకుటం ‘సీతారాం’

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:04 PM

నాటి ప్రజలకు కాలక్షేపం నాటకాలు, తోలుబొమ్మలాట, సినిమా, థియేటర్లు. 1958 డిసెంబరు 30న మొర్రంరెడ్డి నిర్మించిన సినిమా థియేటర్‌ సీతారాం జిల్లాకే మణిమకుటం. అప్పట్లో సినిమా ప్రొజెక్టర్‌, సౌండ్‌ సిస్టం, లైటింగ్‌ ఎఫెక్ట్‌ జపాన్‌ టెక్నాలజీ ఉపయోగించారు. థియేటర్‌ పునాది మొదలు థియేటర్‌ ప్రారంభం వరకు అప్పటి కడప కలెక్టర్‌ మేజర్‌ పీవీ రత్నం ద్వారా ప్రారంభించారు. 1962లో సీతారాం థియేటర్‌ తెరపై మొదటి సినిమా ప్రదర్శితమైంది.

'Sitaram' : మణిమకుటం ‘సీతారాం’
సీతారాం థియేటర్‌ భవనం

అప్పటి అద్భుతం గోపురం..

మరపురాని మధుర స్మృతులెన్నెన్నో

అలరించిన టెంటు, థియేటర్లు..కనుమరుగు

నెమరేసుకుంటున్న స్థానికులు

వాల్మీకిపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నాటి ప్రజలకు కాలక్షేపం నాటకాలు, తోలుబొమ్మలాట, సినిమా, థియేటర్లు. 1958 డిసెంబరు 30న మొర్రంరెడ్డి నిర్మించిన సినిమా థియేటర్‌ సీతారాం జిల్లాకే మణిమకుటం. అప్పట్లో సినిమా ప్రొజెక్టర్‌, సౌండ్‌ సిస్టం, లైటింగ్‌ ఎఫెక్ట్‌ జపాన్‌ టెక్నాలజీ ఉపయోగించారు. థియేటర్‌ పునాది మొదలు థియేటర్‌ ప్రారంభం వరకు అప్పటి కడప కలెక్టర్‌ మేజర్‌ పీవీ రత్నం ద్వారా ప్రారంభించారు. 1962లో సీతారాం థియేటర్‌ తెరపై మొదటి సినిమా ప్రదర్శితమైంది. కొత్త సినిమా వచ్చిందంటే వీధి వీధంతా పండుగను తలపించేంది. వీధిలో మూడు రోడ్లు కలిసే ప్రాంతం కిటకిటలాడే జనంతో ఈలలు, కేకలతో నిండిపోయేది. కాలక్రమేణా జీవన వేగంలో మార్పురావడం, మదనపల్లెలో కొత్త థియేటర్ల నిర్మాణం, ఏసీ థియేటర్లతో కొత్త సినిమాల క్రేజీతో ప్రజలు మదనపల్లెకు వెళ్లి సినిమాలు చూడడం మొదలైంది. దీంతో 2008 ఫిబ్రవరి2వ తేదీన మహాయాగం, అన్నదానం, చేసి ప్రజలకు జీవితచక్రం, బండరాముడు, శ్రీకృష్ణలీల సినిమాలను ఉచితంగా ప్రదర్శించి సీతారాం సినిమా ఽథియేటర్‌కు తెరదించేశారు.


11PLR-VLK2.gifథియేటర్‌లోని ప్రొజెక్టర్‌(ఫైల్‌ఫొటో)

మరో సినిమా థియేటర్‌ సీఏ మహల్‌ కూడా ఇంతటి అనుభూతిని మిగిల్చినా 2009లో సినిమా థియేటర్‌ మూతపడింది. అప్పట్లో ప్రజలను అలరించిన సీతారాం థియేటర్‌ ప్రస్తుతం భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే పాఠశాలగా రూపాంతరం చెందగా మరోథియేటర్‌ సీఏ మహల్‌ రూపురే ఖలు మార్చి కల్యాణ మండ పంలా మారిపోయింది. ఎంతో గొప్ప గుర్తిం పు ఉన్న సీతారాం థియేటర్‌ విషయాలను గుర్తు చేసుకోవాల్సిందే. వివరాల్లోకెళితే...

వాల్మీకిపురం నాటి వాయల్పాడులో సుమారు 60ఏళ్ల కిందట సినిమా టెంట్లు, హాళ్లు గురించి చెప్పుకుంటూ పోతే నాటి మ ధుర స్మృతులు ఎంత గొప్పగా ఉంటాయో. అప్పట్లో వాయల్పాడు అని చెప్పగానే ఎం తో గొప్పగా చెప్పుకునే పేర్లు సీతారాం, సీఏ మహల్‌ సినిమా థియేటర్లు అలరించిన ప్రదర్శనలు, సినిమాలు లేవనడంలో సందేహం లేదు. సీతారామ్‌ థియేటర్‌ వ్యవస్థాపకులు మొర్రంరెడ్డి థియేటర్‌ నిర్మాణం జరిగిన తర్వాత 1962లో సీతారామ్‌ థియేటర్‌ తెరపై మొదటి సినిమా ప్రదర్శితమైంది. అప్పట్లో శ్రీ వేంకటేశ్వరస్వామి మహత్యం మొదలు శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణవిజయం, జీవితచక్రం, లక్ష్మీకటాక్షం, రాము, దసరా బుల్లో డు, ప్రేమ్‌నగర్‌ ఇలా ఎన్నో ఎన్‌టీఆర్‌, నాగేశ్వరరావ్‌, చిరంజీవి, తదితర ఎందరో అగ్రహీరోల సినిమాలు గొప్పగా అలరించాయి.


00.gifపాఠశాలగా మారిన సీతారామ్‌ థియేటర్‌

అప్పట్లో పావలా పెట్టి సినిమా చూసిన వారు బయ టికి వచ్చి సినిమా చూసిన అనుభూతిని వివరిస్తూ సినిమా గొప్పదనాన్ని ఎంతో గొప్పగా చెప్పుకునే రోజులు. సినిమా మారుతుందంటే రెండు మూడు రోజుల ముందు గోడలకు పోస్టర్లను అంటించేవారు. ఊరంతా గోడలకు పోస్టర్లు అంటిస్తుంటే ఎంతో ఆత్రంగా ఏం సినిమా వస్తోంది అంటూ వాక బు చేసేరోజులవి. ఉదయం ఎద్దుల బండితో ప్రచారం, మధ్యా హ్నం ఒంటి గంటకు థియేటర్‌ నుంచి ఊరంతా వినిపించేలా రికార్డులతో మ్యాట్నీ షోలు ప్రారంభమయ్యేవి. గడిచిన అర్ధ శతాబ్దంలో (50ఏళ్లు) ఒక్క సీతారామ్‌ థియేటర్‌లో 4041 సినిమాలు 58,400 ప్రదర్శనలు సాగాయి. 30ఏళ్ల కిందటే వాల్మీకిపురంలోని సినిమా థికేటర్లకు జిల్లాలో మోడల్‌ థియేటర్‌లుగా పేరుండేది. పిల్లలకు సైతం ఎన్నో బెనిఫిట్‌ షోలు చూపించిన మహా ఘని సీతారామ్‌ టాకీస్‌. సీతారామ్‌లో షో మొదలైందంటే ఆ రోజు కొత్తపేట వీధి జనాలతో నిండిపోయేది. అలాంటి కళ ఊరి ప్రజలకు నేడు కనుమరుగైంది. నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన సిని మా థియేటర్లు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం సీతారామ్‌ థియేటర్‌ పాఠశాలగా మారిపోగా సీఏ మహల్‌ భవనాలను కల్యాణ మండపంగా మార్చేశారు. ఎంతో అలరించిన ఈ సిని మా థియేటర్లు ప్రస్తుతం లేకపోవడం... ఎలా ఉన్నా ఒకప్పటి జ్జాపకాలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు.


ఆ జ్ఞాపకాలు చిరకాలం ఉండిపోతాయని అంటున్నారు. అలనాటి నిర్మాణాలలో సీతారామ్‌ థియేటర్‌ భవనాలు మాత్రం నేటికి దర్శనమిస్తున్నాయి. అందులో పనిచేసిన సిబ్బంది కూడా మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు.

ఊరి నడిబొడ్డున ఓ కళ..

మా తాత మొర్రంరెడ్డి స్థాపించిన సీతారాం థియేటర్‌ ఊరి నడిబొడ్డున ఓ ప్రత్యేకమైన కళ. 60ఏళ్ల కిందట అప్పటి కడప కలెక్టర్‌ మే జర్‌ పీవీ రత్నం చేతుల మీదుగా సినిమా హాలును ప్రారంభించారు. అప్పట్లోనే జిల్లా మోడల్‌ థియేటర్‌గా ఎంతో పేరు వచ్చింది. చిన్ననాటి రోజుల్లో రోజూ స్నేహితులతో కలి సి థియేటర్‌ వద్ద సందడి చేసేవాళ్లం. ఆ రోజులు, ఆ విలువలు మధుర జ్ఞాపకాలు.

--మొర్రంరెడ్డి రామ్‌కుమార్‌రెడ్డి, థియేటర్‌ యాజమాన్యం, వాల్మీకిపురం.

20ఏళ్లు ఆపరేటర్‌గా పనిచేశా..

సీతారాం థియేటర్‌లో 20ఏళ్లకు పైగా ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా పనిచేశా. వం దలాది సినిమాలు ప్రేక్షకులతో కలిసి చూసిన అనుభూతి ప్రత్యేకత. వేలాది ప్రదర్శనలతో అలరించిన సినిమా హాళ్లు ప్రస్తుతం లేవంటే బాధగా ఉం టోంది. హాలులో ఈలలు, కేకలు అంతా ఇంతా కాదు. ఆరోజులు, మధుర జ్ఞాపకాలు గుర్తుకువస్తుంటాయి. ఇప్పటికీ స్నేహితులు ఆపరేటర్‌ శీనా అనే పిలుస్తుంటారు. ఆధునిక యుగంలో పాత సినిమా హాళ్లు మరిచిపోతున్నారు.

శ్రీనివాసులు, (ఆపరేటర్‌ శీనా), గాంధీపేట, వాల్మీకిపురం.

టెంట్లు, హాళ్ల కళ ఇక రాదు..

ఒకప్పుడు వాయల్పాడులో టెంటు ఉండేది. అప్పట్లోనే ఎందరో వచ్చేవా రు. కొన్నేళ్లకు రెండు సినిమా థియేటర్లు కట్టడంతో రోజూ మూడు ఆటలతో సినిమాలు నడిచేవి. 15ఏళ్లు ఆపరేటర్‌గా పనిచేశా. అప్పట్లో ఆ వృత్తిలో చాలా గొప్పగా ఉండేది. జిల్లాలోనే మోడల్‌ సినిమా హాళ్లుగా పేరున్న మా ఊర్లో సినిమా హాళ్లు లేవంటేనే బాధగా ఉంటుంది. గుర్తు కు వచ్చినప్పుడల్లా స్నేహితులతో నాటి జ్ఞాపకాలను పంచుకుంటుంటాం.

శ్రీనివాసశాస్త్రి, (ఆపరేటర్‌ శీనాస్వామి), వాల్మీకిపురం

Updated Date - Nov 12 , 2024 | 11:04 PM