Share News

Amaravathi: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష.. మృతుల కుటుంబాలపై ఆరా

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:46 PM

విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Ravi Kumar) శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ షాక్‌తో చనిపోయిన వారి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

Amaravathi: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష.. మృతుల కుటుంబాలపై ఆరా

అమరావతి: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Ravi Kumar) శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ షాక్‌తో చనిపోయిన వారి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధిక ప్రాణ నష్టం ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ లైన్ల మరమ్మతులపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని తెలిపారు. తర్వాత చేయబోయే సమీక్షనాటికి సంబంధిత సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


అది మా విధానం కాదు..

చనిపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బాధితులందరి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు."రాష్ట్రంలో కరెంట్ షాక్ ఘటనలు చాలా జరుగుతున్నాయి. అధికారులంతా ఈ అంశంపై దృష్టిసారించాలి. నిత్యం నివేదికలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ లైన్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చనిపోయిన వారికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడం మా ప్రభుత్వ విధానం కాదు. బాధిత కుటుంబాలందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాం" అని రవి కుమార్ అన్నారు.

For Latest News and AP news click here

Updated Date - Aug 17 , 2024 | 05:46 PM