Share News

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:44 PM

ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని నంద్యాల ట్రాఫిక్‌ సీఐ బి.మల్లికార్జునగుప్త సూచించారు.

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జున గుప్త

నంద్యాల క్రైం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని నంద్యాల ట్రాఫిక్‌ సీఐ బి.మల్లికార్జునగుప్త సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నంద్యాల జిల్లాలో సేఫ్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ సీఐ బి.మల్లికార్జునగుప్త ఆధ్వర్యంలో బుధవారం రామనాథరెడ్డినగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ హెల్మెట్‌లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్‌ లైసెన్స లేకుం డా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, మొబైల్‌ ఫోన వినియోగిస్తూ డ్రైవింగ్‌ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులతోపాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని సీఐ సూచించారు. అనంతరం దాదాపు 250మంది విద్యార్థులతో స్కూల్‌ నుంచి పద్మావతినగర్‌, శ్రీనివాససెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే మానవహారం నిర్వహించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు వాహనదారులకు రోజా పూలు అందించారు.కార్యక్రమంలో ట్రాఫి క్‌ పోలీస్‌ స్టేషన సిబ్బంది, శ్రీచైతన్య స్కూల్‌ ఏజీఎం జి.సురేష్‌, ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.రాధ, డీన దస్తగిరి, ప్రైమరీ ఇనచార్జి జి.సరిత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:45 PM