Share News

Nagababu: నాగబాబు రీ ఎంట్రీ.. వివాదం ముగిసినట్లేనా?

ABN , Publish Date - May 18 , 2024 | 02:46 PM

ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిశోర్ రెడ్డి నివాసానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారు. ఆ క్రమంలో సదరు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారంటూ వార్తలు అయితే సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

Nagababu: నాగబాబు రీ ఎంట్రీ.. వివాదం ముగిసినట్లేనా?
Nagababu

అమరావతి/హైదరాబాద్, మే 18: ఏపీలో ఎన్నికల వేళ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిశోర్ రెడ్డి నివాసానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారు. ఆ క్రమంలో సదరు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారమంటూ వార్తలు అయితే సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

మరోవైపు పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయక పోవడం.. అలాగే వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అతడి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Bihar: దంపతులు ఆత్మహత్య: పోలీస్‌స్టేషన్‌పై బంధువుల దాడి


అటువంటి వేళ.. పోలింగ్ ముగిశాక జనసేన పార్టీ నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎక్స్ వేదికగా మావాడైనా పరాయివాడే.. పరాయివాడైనా మావాడేనంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట హల్‌చల్ చేసింది.

ఈ పోస్ట్ అల్లు అర్జున్‌పైనే పెట్టారంటూ ఓ ప్రచారం సైతం ఉదృతంగా సాగింది. అలాగే ఈ ట్విట్‌పై అటు అల్లు, ఇటు మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ ఓ చర్చ సైతం ప్రారంభమైంది. ఆ క్రమంలో అల్లు రామలింగయ్య లేకుంటే.. నాగబాబు ఉండేవాడు కాదు.. సైకిళ్లకు పంక్చర్ వేసుకొనే వాడంటూ.. అల్లు అర్జున్ పేరుతో ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్ట్ వైరల్ అయింది.

Swati Maliwal: స్వాతి మలివాల్‌ గాయాలపై ఎయిమ్స్ నివేదిక


అలా నాగబాబును అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అనంతరం నాగబాబుకు ఏమైందో ఏమో కానీ.. తన ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. దీంతో గొడవంతా సద్దు మణిగిందని అంతా భావించారు. కానీ తాజాగా నాగబాబు మళ్లీ ఎక్స్ వేదికగా రీ ఎంట్రీ ఇచ్చారు.

అలాగే ఓ పోస్ట్ పెట్టి.. వివాదాన్ని కన్‌ఫార్మ్ చేసినట్లు చెప్పకనే చెప్పారు. అందులో నేను నా ట్విట్ డిలీట్ చేశాను అని రాసుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్‌తో వివాదం వల్లే డిలిట్ చేశాడని.. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతుందని ఓ చర్చ అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 04:40 PM