AP Politics: అందుకే వలంటీర్లు రాజీనామా చేస్తున్నారు.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 13 , 2024 | 10:17 PM
వలంటీర్లంతా రాజీనామా చేయాలని వైసీపీ (YSRCP) నేతలు ఒత్తిడి చేస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత పులివర్తి సుధారెడ్డి (Pulivarthi Sudhareddy) అన్నారు. శనివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రగిరిలో వలంటీర్లపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని.. దీంతో వారిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్లు వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు ఇచ్చారని మిగిలిన వారిని పట్టించుకోలేదని అన్నారు.
తిరుపతి:వలంటీర్లంతా రాజీనామా చేయాలని వైసీపీ (YSRCP) నేతలు ఒత్తిడి చేస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత పులివర్తి సుధారెడ్డి (Pulivarthi Sudhareddy) అన్నారు. శనివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రగిరిలో వలంటీర్లపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని.. దీంతో వారిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్లు వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు ఇచ్చారని మిగిలిన వారిని పట్టించుకోలేదని అన్నారు.
AP Election 2024: అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు: చంద్రబాబు
వలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారని చెప్పారు. వలంటీర్లు ఇప్పటికైనా మేల్కోండి.. రాజీనామాలు చేయవద్దన్నారు. వలంటీర్లను తాము గౌరవిస్తామని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను తీసేయమని చంద్రబాబు చెప్పారని అన్నారు. వైసీపీ నేతల ఆటలో వలంటీర్లు పావుగా మారారని చెప్పారు. వలంటీర్లకు తాము అండగా ఉంటామని.. రాజీనామాలు చేయొద్దని సూచించారు.
Balakrishna: నవరత్నాలతో మోసం చేసిన జగన్
రానున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా గెలిచేందుకు చంద్రగిరి వైసీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 6వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను నమోదు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చాకా వలంటీర్లకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లకు ఎపిక్ కార్డులు అందడం లేదన్నారు. తనను గాయపరిచిన కొంతమంది వైసీపీ మూకలపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పులివర్తి సుధారెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
Chandrababu: ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..
మరిన్ని ఏపీ వార్తల కోసం...