Share News

Rushikonda : చదరపు అడుగుకు రూ.30 వేలు

ABN , Publish Date - Jun 19 , 2024 | 03:39 AM

రుషికొండపై పర్యాటక భవనం పేరుతో చేపట్టిన నిర్మాణం, దానికి వెచ్చించిన వ్యయం చూసి విశాఖపట్నంలో బిల్డర్లు ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఏడు భవనాలలో 1,48,413 చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాకు రూ.450 కోట్లు ఎలా ఖర్చు చేశారని తెల్ల ముఖాలు వేస్తున్నారు.

 Rushikonda : చదరపు అడుగుకు రూ.30 వేలు

రుషికొండపై నిర్మాణాలకు అతి భారీ వ్యయం

స్టార్‌ హోటళ్లలో రూ.కోటితో అన్ని హంగుల గది

రూ.450 కోట్లకు రావలసిన రూమ్‌లు 450

కానీ.. నిర్మించినవి 12 బెడ్‌ రూమ్‌లే

చదరపు అడుగుకు ఏకంగా రూ.30 వేలు

స్టార్‌ హోటల్‌ పేరుతో నిర్మాణం ప్రారంభం

పర్యాటకులకు ఒక్క రూమ్‌ లేకుండా భవనాల పూర్తి

స్టార్‌ హోటళ్లలో కోటికి అన్ని హంగులతో రూమ్‌

రూ.450 కోట్లకు రావలసిన రూమ్‌లు 450

కానీ నిర్మించినవి కేవలం 12 బెడ్‌ రూమ్‌లే

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రుషికొండపై పర్యాటక భవనం పేరుతో చేపట్టిన నిర్మాణం, దానికి వెచ్చించిన వ్యయం చూసి విశాఖపట్నంలో బిల్డర్లు ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఏడు భవనాలలో 1,48,413 చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాకు రూ.450 కోట్లు ఎలా ఖర్చు చేశారని తెల్ల ముఖాలు వేస్తున్నారు. విశాఖలో ఇటీవల కాలం లో నిర్మించిన స్టార్‌ హోటళ్లు చాలా ఉన్నాయి. రుషికొండలో జగన్‌ ప్యాలె్‌సకు కేవలం కిలో మీటరు ముందు రాడీసన్‌ బ్లూ హోటల్‌ ఉంది. అక్కడ ఒక్కో సూట్‌ రూమ్‌ నిర్మాణానికి ఫర్నిషింగ్‌తో సహా రూ.కోటి వ్యయం అయింది. పదేళ్ల క్రితం ఆర్‌కే బీచ్‌ రోడ్డులో నిర్మించిన నోవాటెల్‌కు అప్పట్లో రూమ్‌కి రూ.60 లక్షల వ్యయం అయింది. స్టార్‌ హోటళ్లలో సగటున ఒక్కో రూమ్‌ వేయి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే కామన్‌ ఏరియా, రెస్టారెంట్‌, బాంకెట్‌ హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌ అన్నీ కలుపుకొని రూమ్‌కు వేయి చదరపు అడుగుల విస్తీర్ణం వస్తుంది. అలా ఒక్కో రూమ్‌కు బెడ్‌, బాత్‌రూమ్‌ టబ్‌, సో ఫాలు, టీవీ, ఫర్నీచర్‌ అన్నీ కలిపి రూ.కోటి వ్యయం అవుతుందని విశాఖలో పేరొందిన బిల్డర్లు చెబుతున్నారు. ఆ లెక్కన చూసుకుం టే చదనపు అడుగు రూ.10 వేలు ఖర్చు అవుతుంది. ఇలా చూస్తే, రుషికొండపై వెచ్చించిన రూ.450 కోట్లకు 450 రూమ్‌లు అన్ని హంగులతో రావాలి. కానీ అక్కడ జగన్‌ కుటుంబం కోసం నిర్మించుకున్న 12 బెడ్‌రూమ్‌లు తప్ప ఇంకేమీ లేవు. మిగిలినవన్నీ సమావేశ మందిరాలు. అలాంటి వాటికి చదరపు అడుగు ఒక్కింటికి రూ. 30 వేలు ఖర్చు చేశారు. ఆ వ్యయానికి తగిన ఆనవాళ్లు మాత్రం రూమ్‌ల రూపంలో అక్కడ లేవు. చదరపు అడుగుకు రూ.10 వేలు అవ్వాల్సినచోట 2 రెట్లు అధికంగా అంటే రూ.30 వేలు ఎక్కువ ఖర్చు చేశారు. ఇదంతా ప్రజాధనం. బిల్డర్ల లెక్కల ప్రకారం 1,48,315 చదనపు అడుగుల బిల్డప్‌ ఏరియా కు రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ లెక్కలు చూపిస్తున్నది రూ.450 కోట్లకు. అంటే, బయటకు చెప్పింది ఒకటి.. లోపల చేసింది మరొకటి.

Updated Date - Jun 19 , 2024 | 03:40 AM