Share News

Andhra Pradesh: టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై వైసీపీ సంబరాలు..!

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:57 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ళ వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు.

Andhra Pradesh: టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై వైసీపీ సంబరాలు..!
YSRCP and Kalyan banerjee

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ళ వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేశారు. అయినప్పటికీ వాటిని ప్రజలు విశ్వసించకపోగా.. కూటమికి ఘన విజయాన్ని అందించారు. దీంతో వైసీపీ నేతల ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. తీవ్రస్థాయిలో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ నేతలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకెళ్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశంసలు అందుకుంటున్న వేళ.. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ కుటిల యత్నాలు చేస్తోంది. ఎంత వెతికినా టీడీపీని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేసేందుకు ఎటువంటి అంశాలు లేకపోవడంతో వైసీపీ ఏవిధంగానైనా టీడీపీ అధినేత చంద్రబాబుపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా లోక్‌సభలో మంగళవారం పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అవగాహన రాహిత్యంతో చేసిన ఓ వ్యాఖ్యను హైలెట్ చేస్తూ చంద్రబాబునాయుడుపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట.

CM Chandrababu: అమరావతి రాజధానిపై నేడు శ్వేతపత్రం విడుదల


టీఎంసీ ఎంపీ ఏమన్నారంటే..

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇదే సమయంలో ఈడీ, సీబీఐతో పలువురు రాజకీయ నేతలను బెదిరించి బీజేపీ లొంగదీసుకుంటుందని ఆరోపించారు. దీనిలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని, బీజేపీ దర్యాప్తు సంస్థలతో బెదిరించి ఎన్డీయేలో చేర్చుకుందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై సీబీఐ, ఈడీ కేసులు లేవని, తమ నాయకుడిపై సీఐడీ పోలీసులతో గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించిందని, సమాచారలోపంతో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. కళ్యాణ్ బెనర్జీ అవగాహన రాహిత్యంతో చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పవన్ మూడో రోజు పర్యటన


వైసీపీ వెర్షన్ ఏమిటంటే..

చంద్రబాబు నాయుడుని సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదని పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎంపీ ప్రశ్నించారని, అంటే చంద్రబాబు చేసిన తప్పులను ఇతర రాష్ట్రాల ఎంపీలు ప్రశ్నిస్తున్నారని, రాష్ట్రం పరువుపోయిందంటూ వైసీపీ నేతలు గగ్గొలు పెడుతున్నారు. ఇటీవల కాలంలో అసలు చంద్రబాబుపై సీబీఐ, ఈడీ కేసులు లేనప్పుడు ఆ సంస్థలు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తాయనే కనీస అవగాహన లేకుండా వైసీపీ నేతలు వింతగా ప్రవర్తిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా వైసీపీ తన తీరు మార్చుకుంటుందా.. లేదా పరువు పోయినా పర్వాలేదు.. వింతగానే ప్రవర్తిస్తామంటూ ముందుకు సాగుతుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.


AP News: ఆగని అక్రమ రేషన్ తరలింపు.. తాజాగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 03 , 2024 | 09:57 AM