Share News

వాలంటీర్లతో సీఎం జగన్ రహస్య భేటీ

ABN , Publish Date - Apr 06 , 2024 | 08:09 PM

వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాలంటీర్లతో రహస్యంగా భేటీ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి శివారులో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌‌కుమార్ రెడ్డికి చెందిన స్కూల్‌ అందుకు వేదిక అయింది. సీఎం జగన్ భోజన విరామ సమయంలో వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేయాలంటూ ఈ సందర్భంగా వాలంటీర్లకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

వాలంటీర్లతో సీఎం జగన్ రహస్య భేటీ
YS Jagan

నెల్లూరు, ఏప్రిల్ 06: వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాలంటీర్లతో రహస్యంగా భేటీ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి శివారులో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌‌కుమార్ రెడ్డికి చెందిన స్కూల్‌ అందుకు వేదిక అయింది. సీఎం జగన్ భోజన విరామ సమయంలో వాలంటీర్లతో సమావేశమయ్యారు.

ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేయాలంటూ ఈ సందర్భంగా వాలంటీర్లకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అయితే ఎన్నికల వేళ.. పెన్షన్ పంపిణి కార్యక్రమానికి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది.


YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైయస్ జగన్.. మేము సిద్దం పేరిట బస్సు యాత్రను చేపట్టారు. అందులోభాగంగా కావలిలో వాలంటీర్లతో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత వారికి విందు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు ఓ ప్రచారం అయితే నడుస్తోంది.

దీంతో వరుసగా రెండో సారి అధికారాన్ని అందుకొనేందుకు వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్... తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇంకోవైపు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు వరుసగా రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల సేవలు వినియోగించుకొనేందుకు ఇప్పటికే వైసీపీ నాయకులు పలువురు రంగంలోకి దిగారు.

ఎందుకంటే గత నాలుగేళ్లుగా వాలంటీర్లు.. తమ సచివాలయ పరిధిలో కీలకంగా వ్యవహరిస్తు వస్తున్నారు. దీంతో వారికి స్థానికంగా ఉన్న గుట్టుమట్లన్నీ తెలుసునని.. ఆ క్రమంలో వారి సేవలు వినియోగించు కోవాలని వైసీపీలోని కీలక నేతలు.. పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు ఓ ప్రచారం అయితే నడుస్తోంది.

మరిన్నీ ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం...

Updated Date - Apr 06 , 2024 | 08:09 PM