Share News

Microsoft outage: దానివల్లే విండోస్‌లో సమస్య.. పూర్తిగా పరిష్కరించామని క్రౌడ్‌స్ట్రైక్‌ వెల్లడి

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:04 AM

సైబర్‌ సెక్యూరిటీ అప్‌డే‌ట్‌‌ చేస్తున్నప్పుడు ఏర్పడ్డ బగ్‌వల్లే ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఇబ్బందులు తలెత్తాయని క్రౌడ్‌స్ట్రైక్‌ వెల్లడించింది. దానివల్లే లక్షల కంప్యూటర్లలోకి అనవసర సమాచారం వెళ్లిందని బుధవారం ప్రకటించింది.

Microsoft outage: దానివల్లే విండోస్‌లో సమస్య.. పూర్తిగా పరిష్కరించామని క్రౌడ్‌స్ట్రైక్‌ వెల్లడి

వాషింగ్టన్‌: సైబర్‌ సెక్యూరిటీ అప్‌డే‌ట్‌‌ చేస్తున్నప్పుడు ఏర్పడ్డ బగ్‌వల్లే ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఇబ్బందులు తలెత్తాయని క్రౌడ్‌స్ట్రైక్‌ వెల్లడించింది. దానివల్లే లక్షల కంప్యూటర్లలోకి అనవసర సమాచారం వెళ్లిందని బుధవారం ప్రకటించింది.

ఇటీవల క్రౌడ్‌స్ట్రైక్‌ అప్‌డేట్‌తో విండోస్‌లో సమస్యలు తలెత్తి అంతర్జాతీయంగా విమానాలు నిలిచిపోవడం, అనేక ఎలెక్ట్రానిక్ వస్తువుల సేవలు ఆగిపోవడంతోపాటు బ్యాంకులు, ఆసుపత్రులు, వ్యాపారాలకు ఇబ్బందులు కలిగింది. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో తేలిన అంశాలను సంస్థ ఆన్‌లైన్‌లో వెల్లడించింది.


‘కంటెంట్‌ కాన్ఫిగ్యురేషన్‌ అప్‌డేట్‌లో గుర్తించలేని బగ్ ఫలితంగా విండోస్‌ కంప్యూటర్లలోని ఫాల్కన్‌ ప్లాట్‌ఫాం ప్రభావితమైంది’ అని క్రౌడ్‌స్ట్రైక్‌ పేర్కొంది. క్రౌడ్‌స్ట్రైక్‌ ప్రధాన కేంద్రం టెక్సాస్‌లో ఉంది. కంటెంట్‌ వాలిడేషన్‌ వ్యవస్థలో ఇబ్బందికర కంటెంట్‌ డేటాను బగ్‌ చొప్పించిందని, అది అనూహ్య సమస్యను సృష్టించిందని, విండోస్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థ కుప్పకూలిందని వివరించింది.


భవిష్యత్తులో ఇటువంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లలో గత శుక్రవారం సమస్య తలెత్తిందని పేర్కొంది. విచారణ పూర్తి స్థాయిలో జరిపాకే వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు క్రౌడ్‌స్ట్రైక్ వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఇటీవల ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని చెప్పింది.

For Latest News and National News click here

Updated Date - Jul 25 , 2024 | 08:04 AM