Money Saving Plan: ఇలా పెట్టుబడి చేస్తే గ్యారంటీ ఇన్‌కమ్.. కోటీశ్వరులవ్వడం ఖాయం..
ABN , Publish Date - Sep 11 , 2024 | 01:08 PM
మీరు ఎలాంటి రిస్క్ లేకుండా కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకంలో పెట్టబుడులు చేసి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ మొత్తాన్ని పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే క్రమశిక్షణ కల్గిన పెట్టుబడి చేస్తే చాలు. అందుకోసం ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రభుత్వ పథకంలో పెట్టబుడులు(investments) చేసి గ్యారంటీ మొత్తాన్ని పొందవచ్చు. అందుకోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా మీరు మిలియనీర్ కావచ్చు. అయితే దీని ద్వారా ఎలా మిలియనీర్ కావచ్చు, ఎంత మొత్తం పెట్టుబడి చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఏటా
PPF అనేది మీరు ప్రభుత్వం నుంచి హామీ పొందే గ్యారంటీ పథకం. ఇది 15 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే పథకం. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే మీరు కోటీశ్వరులు కావాలంటే ఈ స్కీంలో మీరు ప్రతి ఏటా రూ. 1,00,000 డిపాజిట్ చేస్తే, మీరు కొన్ని సంవత్సరాలలో కోటీశ్వరులు కావచ్చు. లేదంటే నెలకు రూ. 8,334 డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ క్రమంలో మీరు ఈ పథకాన్ని 15 సంవత్సరాలు పూర్తి చేయడానికి ముందే పొడిగించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు పొడిగించాలి. ఇలా మరో రెండుసార్లు పొడిగించవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పథకంలో పెట్టుబడిని 15 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు కొనసాగించాలి.
వడ్డీ రూపంలో
ఆ క్రమంలో మీరు 30 సంవత్సరాలలో పెట్టుబడి చేసే మొత్తం రూ. 30,00,000 అవుతుంది. దీంతో మీకు 7.1 శాతం వడ్డీ చొప్పున మీరు చేసిన పెట్టుబడిపై వడ్డీగా రూ. 73,00,607 పొందుతారు. ఈ విధంగా మీరు 30 ఏళ్ల తర్వాత మీ మెచ్యూరిటీ మొత్తంతో కలిపి రూ. 1,03,00,607 అవుతుంది. మీరు 5 సంవత్సరాల బ్లాక్‌లో ఎన్నిసార్లు అయినా PPFని పొడిగించుకోవచ్చు. 15 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీ PPF ఖాతాను కంట్రిబ్యూషన్‌లతో కొనసాగించడానికి మీరు ఖాతా నిర్వహిస్తున్న బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు దరఖాస్తును సమర్పించాలి.
ఎలాగైనా
మీరు మెచ్యూరిటీ తేదీ నుంచి 1 సంవత్సరం పూర్తి చేయడానికి ముందు ఈ దరఖాస్తును అందించాలి. పొడిగింపు కోసం ఫారమ్‌ను సమర్పించాలి. PPF ఖాతా తెరిచిన అదే పోస్ట్ ఆఫీస్/బ్యాంక్ బ్రాంచ్‌లో ఫారమ్ అందించాలి. అయితే ఈ పెట్టుబడి విధానాన్ని మీకు వయస్సు తక్కువ ఉన్న సమయంలో ప్రారంభిస్తే సులభం అవుతుంది. మీ పిల్లల పేరుపై కూడా ఈ పెట్టుబడి మొత్తం కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
TRAI: కోటికిపైగా ఫేక్ మొబైల్ కనెక్షన్‌లు తొలగింపు.. కారణమిదే..
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..
Read MoreBusiness News and Latest Telugu News