Share News

Money Saving Tips: నెలకు రూ.5 వేల పెట్టుబడి.. PPF vs SIP వీటిలో ఏది బెటర్?

ABN , Publish Date - Aug 26 , 2024 | 06:23 PM

మీరు తక్కువ మొత్తంలో ఎక్కువకాలం పెట్టుబడి(investments) పెట్టాలని చూస్తున్నారా. అందుకోసం ప్రధానంగా రెండు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పథకాలలో ఎలా పెట్టుబడి పెట్టాలి, మెచ్యూరిటీలో ఎంత రాబడి వస్తుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Money Saving Tips: నెలకు రూ.5 వేల పెట్టుబడి.. PPF vs SIP వీటిలో ఏది బెటర్?
PPF vs SIP

ప్రస్తుత కాలంలో అనేక మంది తక్కువ మొత్తంలో ఎక్కువకాలం పెట్టుబడి(investments) పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం దేనిలో పెట్టుబడి చేస్తే ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ప్రధానంగా రెండు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని అందిస్తుంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). మరొకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP). దీనిలో కొంత రిస్క్ ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులను బట్టి రాబడులు ఎక్కువ లేదా తక్కువ కావచ్చు. అయితే ఈ పథకాలలో ఎలా పెట్టుబడి పెట్టాలి, మెచ్యూరిటీలో ఎంత రాబడి వస్తుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


పీపీఎఫ్ అంటే...

ఈ రెండూ కూడా దీర్ఘకాలిక స్కీమ్స్. PPF అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందులో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. రాబడికి కూడా హామీ ఇవ్వబడుతుంది. రూ.500తో కూడా పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. ఒక సంవత్సరంలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. మీ పెట్టుబడి మెచ్యూర్ కావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. మీరు దీనిని 5, 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 శాతం వడ్డీ ఇస్తోంది.

ఇది సమ్మేళనం ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో రాబడి మొత్తం ఎక్కువగా వస్తుంది. ఈ క్రమంలో మీరు దీనిలో నెలకు రూ.5 వెల చొప్పున పొదుపు చేస్తే 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 9,00,000 అవుతుంది. ఆ తర్వాత మీకు లభించే మొత్తం రూ. 16,27,284 అవుతుంది. అంటే మీకు అదనంగా రూ.7,27,284 వడ్డీ లభిస్తుంది.


SIP ప్రయోజనాలు ఏంటి?

మీరు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. సరైన పరిశోధన చేసిన మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టాలి. మీరు 100 రూపాయలతో కూడా దీనిలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. నిర్దిష్ట కాలం లేదు. మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా విరమించుకోవచ్చు. ఇక సిప్ రిటర్న్‌లు మార్కెట్ పనితీరుతో అనుసంధానమై ఉంటాయి.

స్థిరమైన రాబడి ఉండదు. కానీ సగటు రాబడి గురించి మాట్లాడితే 12 శాతంగా ఉంది. దీని ప్రకారం చూస్తే మీరు నెలకు రూ. 5000 పెట్టుబడి పెడితే మీరు 15 సంవత్సరాలలో చేసిన పెట్టుబడి మొత్తం రూ. 9,00,000 అవుతుంది. ఆ తర్వాత మీరు వడ్డీతోపాటు మొత్తం రూ. 25,22,880 పొందే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో మీకు వడ్డీ రూపంలో రూ. 16,22,880 లభిస్తాయి.


PPF మంచిదా లేక SIP?

ఈ రెండింటిలో ఏది మంచిదని అంటే సమాధానం మాత్రం మీ రిస్క్‌పై మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు రెండింటి రాబడిని పోల్చడం ద్వారా పెట్టుబడి గురించి నిర్ణయం తీసుకోవచ్చు. మీకు కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే సిప్ విధానం మేలు. దీనిలో దీర్ఘకాలంలో రిస్కుతోపాటు రిటర్న్స్ కూడా ఎక్కువగా వస్తాయి.


ఇవి కూడా చదవండి:

Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. సెబీ నోటీస్ నేపథ్యంలో షేర్లు ఏకంగా..

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 06:27 PM