Share News

Budget 2024: నిర్మలమ్మకు స్వీట్ తినిపించిన రాష్ట్రపతి ముర్ము.. మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్ 2024

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:02 AM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఈ రోజు (మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Budget 2024: నిర్మలమ్మకు స్వీట్ తినిపించిన రాష్ట్రపతి ముర్ము.. మరికొద్ది సేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్ 2024
President Murmu with Nirmala Sitharaman

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఈ రోజు (మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11:00లకు పార్లమెంట్‌లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించబోతున్నారు (Budget 2024).


పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. ముందుగా ఉదయం పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ‌కు వెళ్లిన నిర్మలమ్మ బడ్జెట్ ట్యాబ్లెట్‌ను తీసుకున్నారు. తన టీమ్‌తో కలిసి బడ్జెట్ ప్రతులను తీసుకుని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముకు బ‌డ్జెట్ కాపీల‌ను అంద‌జేశారు. అనంరతం నిర్మలా సీతారామ్‌నుకు రాష్ట్రపతి దహీ చెన్నీ స్వీట్‌ను తినిపించి గుడ్‌లక్ చెప్పారు.

Updated Date - Jul 23 , 2024 | 11:02 AM