Share News

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..

ABN , Publish Date - Sep 08 , 2024 | 03:45 PM

ఇప్పటి నుంచే పదవీ విరమణ కోసం కొంత డబ్బును ఆదా చేస్తే ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అయితే మీరు రిటైర్ మెంట్ సమయంలో పలు రకాల ఖర్చుల కోసం రూ.8 కోట్లు రావాలని ప్లాన్ చేసుకుంటే ఎందులో పెట్టుబడి చేయాలి. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Retirement plan rs 8 crore

ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మంది మాత్రమే పదవీ విరమణ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటి నుంచే పదవీ విరమణ కోసం కొంత డబ్బును ఆదా చేస్తే ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. సాధారణ ఆదాయం కోసం ప్రజలు ఇప్పటికే వివిధ పథకాల్లో పెట్టుబడి(investment) పెడుతున్నారు. అయితే మీరు రిటైర్ మెంట్ సమయంలో పలు రకాల ఖర్చుల కోసం రూ.8 కోట్లు రావాలని ప్లాన్ చేసుకుంటే ఎందులో పెట్టుబడి చేయాలి. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఎంత సేవ్

దీర్ఘకాంలో పెట్టుబడులు చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIP) బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల సంవత్సరాలలో భారతదేశంలో ఇవి మంచి ప్రజాదరణ పొందాయి. దీంతోపాటు వీటిలో కనీసం 10 శాతానికి పైగా రిటర్న్స్ వస్తుండటంతో అనేక మంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. వీటిని పెట్టుబడిదారులు చిన్న మొత్తంతో కూడా ప్రారంభించవచ్చు. అయితే రూ.8 కోట్ల మొత్తం కావాలంటే నెలకు ఎంత సేవ్ చేయాలి, ఏన్నేళ్లు పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.


వడ్డీ రూపంలోనే

ఇక రిటైర్ మెంట్ సమయానికి రూ.8 కోట్ల కార్పస్‌ కావాలంటే నెలకు రూ. 12,320 సిప్ విధానంలో పెట్టుబడి పెట్టాలి. ఆ క్రమంలో 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. ఆ విధంగ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ.51,74,400 అవుతుంది. అదే సమయంలో మీకు వచ్చేది మాత్రం రూ. 8 కోట్ల 00 21 వేల 715 వస్తుంది. ఈ నేపథ్యంలో మీకు 7 కోట్ల 48 లక్షల 47 వేల 315 రూపాయలు వడ్డీ రూపంలోనే లభిస్తుంది. వార్షిక రాబడి 12 శాతం చొప్పున తీసుకుంటే ఈ మొత్తం వస్తుంది. సిప్ విధానంలో ప్రస్తుతం వార్షిక రాబడి 12 శాతానికి పైగా లభిస్తుంది.


అదనంగా

ఒకవేళ మీకు ఇదే సమయంలో రాబడి 15 శాతం వస్తే మీకు అదనంగా మరో 10 కోట్లు ఎక్కువ వస్తాయి. అంటే మొత్తం రూ. 18 కోట్ల 30 లక్షల 83 వేల 145 లభిస్తాయి. మీరు కూడా మీ పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తాన్ని పొందాలనుకుంటే ఈ సిప్ విధానాన్ని ఎంచుకోవచ్చు. మీరు తక్కువ వయసులో పెట్టుబడి ప్రారంభించడం ద్వారా పదవీ విరమణ సమయానికి ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు.

గమనిక: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.


ఇవి కూడా చదవండి:

Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..


BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 08 , 2024 | 03:47 PM