Share News

Ugadi 2024: ఉగాది పచ్చడి తినేప్పుడు చదవాల్సిన మంత్రం ఏంటో తెలుసా..!!

ABN , Publish Date - Apr 08 , 2024 | 06:04 PM

అచ్చ తెలుగు పండగ. తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు ఉగాది. పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉగాది అంటారు. ఆ రోజు చేసే పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

Ugadi 2024: ఉగాది పచ్చడి తినేప్పుడు చదవాల్సిన మంత్రం ఏంటో తెలుసా..!!
Do You Know What Mantra Chant While Eating Ugadi Prasadam

అచ్చ తెలుగు పండగ. తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు ఉగాది (Ugadi). పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉగాది అంటారు. ఆ రోజు చేసే పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. చెరకు గడ, అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయ, బెల్లం వాడతారు. ఈ ఆరు రకాల పదార్థాలతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఏడాది పాటు ఎదురయ్యే కష్ట, సుఖాలు, మంచి చెడులను స్వీకరించాలనే సందేశం ఉగాది పచ్చడి అందజేస్తోంది.


ఉగాది రోజున మట్టి కుండలో పచ్చడి తయారు చేసుకుంటారు. ఆ పచ్చడిని దేవుడి ముందు పెట్టి పూజిస్తారు. ఆ సమయంలో మంత్రం చదవాలి.

త్యామష్ఠ శోక నరాభీష్ట

మధుమాస సముద్భవ

నిబామి శోక సంతప్తాం

మమ శోకం సదా కురు

అని జపించిన తర్వాత ఒక్కొ కుటుంబ సభ్యులు ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఉగాది పచ్చడిని ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు తీసుకోవచ్చు. పచ్చడిలో కొందరు ఫ్రూట్స్ వేసి సలాడ్ మాదిరిగా చేస్తున్నారు. దాంతో పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.


ఉగాది పచ్చడిలో ఉంటే ఆరు రుచులు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సుఖాలకు పొంగిపోవద్దని, దుఖాలకు కుంగిపోవద్దని సందేశం ఇస్తోంది. రెండింటిని సమానంగా స్వీకరించాలని చెబుతోంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉగాదిగా పిలుస్తారు. మహారాష్ట్రలో గుడి పాడ్వా అంటారు. తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషు, పంజాబ్‌లో వైశాఖీ, పశ్చిమ బెంగాల్‌లో పొయ్‌లా బైశాఖ్‌గా పిలుస్తారు.


మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం

Updated Date - Apr 08 , 2024 | 06:04 PM