Share News

ఈ రాశుల వారికి విదేశీ వ్యవహారాల్లో మంచి విజయాలు

ABN , Publish Date - May 18 , 2024 | 07:44 AM

నేడు(18-5-2024 - శనివారం ) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.

ఈ రాశుల వారికి విదేశీ వ్యవహారాల్లో మంచి విజయాలు

నేడు(18-5-2024 - శనివారం )కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. టెలివిజన్‌, క్రీడలు, చిట్‌ఫండ్‌ రంగాల వారు కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యుల వ్యవహార శైలి గురించి ఆలోచిస్తారు. ఇల్లు, స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విరామ కాలక్షేపాల ద్వారా మనశ్శాంతి కోసం ప్రయత్నిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ప్రియతముల నుంచి ఆహ్లాదకరమైన సమాచారం అందుకుంటారు. విద్యా సంస్థలో ప్రవేశానికి అనుకూలం.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు అందుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రభుత్వ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. పాస్‌పోర్ట్‌, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయ వివాదాలు పరిష్కారం అెుతాయి.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. న్యాయ వివాదాల్లో పైచేయి సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభపద్రం.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

మీ సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పన్నుల వ్యవహారాలు, వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గృహ రుణాలు మంజూరవుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఒప్పందాలకు అనుకూల సమయం. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పెట్టుబడులకు సంబందించిన నిర్ణయాలు తీసుకుంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - May 18 , 2024 | 07:44 AM