Share News

Horoscope Today: ప్రతి రాశి వారికీ ఓ సూచన ఉంది.. అదేంటంటే..

ABN , Publish Date - May 11 , 2024 | 07:00 AM

నేడు (11-5-2024 - శనివారం) వేడుకలుకు ఏర్పాట్లు చేసుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి...

Horoscope Today: ప్రతి రాశి వారికీ ఓ సూచన ఉంది.. అదేంటంటే..

నేడు (11-5-2024 - శనివారం) వేడుకలుకు ఏర్పాట్లు చేసుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలుకు ఏర్పాట్లు చేసుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు. ఫర్నీచర్‌ కొనుగోలు చేస్తారు.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులు విషయంలో శుభపరిణామాలు సంభవం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సమాచారం అవేదన కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు విషయంలో తొందరపాటు తగదని గ్రహించండి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పదిమందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకారం సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. అనవసరంగా అపనిందలకు గురికావాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన చర్చల్లో నిదానం అవసరం. సన్నిహితుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. హనుమాన్‌ చాలీసాపారాయణ శుభప్రదం

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పూర్వ మిత్రులను కలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో కొంత అసంతృప్తి నెలకొంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రముఖుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆహారపానీయాల్లో నియామాలు పాటించడం అవసరం. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. పందాలు, పోటీలు, షేర్‌ ట్రేడింగ్‌లలో జాగ్రత్తలు పాటించడం మించిది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో తలపెట్టిన పనులు పూర్తి కాకపోవడంతో అ సౌకర్యానికి గురవుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్‌ సందేశాలు, మెయిల్స్‌ అనందం కలిగిస్తాయి. చిన్నారలు, ప్రియతముల మాటతీరు ఆవేదన కలిగిస్తుంది. ప్రకటనలు, చిట్‌ఫండ్‌లు, విద్యాసంస్థల వారు రాతకోతల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - May 11 , 2024 | 07:02 AM