Share News

Today Horoscope : ఈ రాశి వారు ఉన్నత పదవులు అందుకుంటారు !

ABN , Publish Date - Sep 07 , 2024 | 02:44 AM

నేడు (07-09-25024-శనివారం) వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Today Horoscope :  ఈ రాశి వారు ఉన్నత పదవులు అందుకుంటారు !

నేడు (07-09-25024-శనివారం) వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుగుంది. విందు వినోదాలకు ఖర్చులు అధికం. శ్రీ గణనాధుని ఆరాధన శుభప్రదం.


02 VRUSHABAMAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాల్లో పాల్గొంటారు. సేవలు వ్యవసాయం, పరిశ్రమలు, ఫార్మా రంగాల వారికి అనుకూల సమయం. బంధుమిత్రులతో ఉల్లాసగా గడుపుతారు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


03 MITHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. అడ్వర్టయిజ్‌మెంట్‌, ఆడిటింగ్‌, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. గణనాధుని ఆరాధించండి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి చర్చలు ఫలిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. అగ్రిమెంట్లు, రాతకోతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి ఆలయదర్శనం శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పొదుపు పథకాలు, పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు సకాలంలో చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.


07 THULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. తలపెట్టిన పనుల్లో జాప్యం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. గణేశపంచరత్నమాల పారాయణ శుభప్రదం.


08 VRUSHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ప్రచురణ, టెక్స్‌టైల్స్‌, సినిమా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, దూరప్రయాణాలకు అవసరమైన నిదులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో బందుమిత్రుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది.


09 DHANASSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పది మందిలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. సమావేశాలు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం ల భిస్తుంది. వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. ప్రయణాలు, చర్చలకు అనుకూలం. గౌరవ, మద్యాదలు, ఉన్నత పదవులు అందుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్ల్యాలు సాధిస్తారు. రాజకీయ, న్యాయరంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. వేడుకల్లో ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. గణపతిని ఆరాధించండి.


12 MEENAM.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీల్లో నిదానం పాటించడం అవసరం. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. గణ నాధుని ఆరాధన శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Sep 07 , 2024 | 02:44 AM