Share News

Today Horoscope: ఈ రాశి వారు వేడుకల్లో పాల్గొంటారు.

ABN , Publish Date - Oct 12 , 2024 | 06:05 AM

నేడు (12-10-2024-శనివారం) బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు.

Today Horoscope: ఈ రాశి వారు వేడుకల్లో పాల్గొంటారు.

నేడు (12-10-2024-శనివారం) బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ప్రభుత్వ అధికారుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. పెద్దలతో సమావేశాలు ఫలిస్తాయి. కొత్త వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రులు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, మూచ్యువల్‌ ఫండ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, ఆస్పత్రుల రంగాల వారికి అనుకూల సమయం. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. చిట్‌ఫండ్‌, ప్రకటనలు, కళా రంగాల వారికి అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు అనుకూల సమయం. ఫర్నీచర్‌, నిత్యావసరాలు, హార్డ్‌వేర్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహనిర్మాణం, స్థల సేకరణ, అద్దె నిర్ణయాల గురించి ఆరాతీస్తారు.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. స్టేషనరీ, రవాణా, ఏజెన్సీలు, మార్కెటింగ్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. విదేశీ ప్రయాణాలు, ఇంటర్వ్యూలకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటారు. గోమాతను ఆరాధించండి.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, ఉత్సవాల్లో పాలొం్గంటారు. వ్యాపారరంగంలోని వారికి అర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. అదనపు ఆదాయం అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పదిమందిలో గౌరవ మన్ననలు అందుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్లు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. సేవా కార్యక్రమాలు తృప్తినిస్తాయి.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంక్‌ డిపాజిట్లు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రాజరాజేశ్వరీ మాత ఆరాధన శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 12 , 2024 | 06:05 AM