Zodiac Sign: ఈ 5 రాశుల వారికి ఇది లక్కీ టైమ్.. పట్టిందల్లా బంగారమే ఇక..!
ABN , Publish Date - Jun 13 , 2024 | 09:33 AM
Surya Gochar 2024: సూర్యుడు నెలకు ఒక రాశి మారుతాడు. జూన్ నెలలో సూర్య సంచారం జరగనుంది. జూన్ 15వ తేదీన సూర్యుడి స్థానచలనం జరుగుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15న ఉదయం 4:27 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంవత్సరం తరువాత సూర్యుడు మళ్లీ మిథునరాశిలోకి వస్తున్నాడు.
Surya Gochar 2024: సూర్యుడు నెలకు ఒక రాశి మారుతాడు. జూన్ నెలలో సూర్య సంచారం జరగనుంది. జూన్ 15వ తేదీన సూర్యుడి స్థానచలనం జరుగుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15న ఉదయం 4:27 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంవత్సరం తరువాత సూర్యుడు మళ్లీ మిథునరాశిలోకి వస్తున్నాడు. నెల రోజుల పాటు మిథునరాశిలోనే ఉంటాడు. అయితే, ఇదే సమయంలో బుధుడు కూడా మిథున రాశిలో ఉన్నాడు. ఒకే సమయంలో సూర్యుడు, బుధుడు మిథునరాశిలో సంచరించడం వలన పలు రాశుల వారికి శుభ, అశుభ ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందుకే కొన్ని రాశుల వారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈ నెల రోజుల వ్యవధిలో 5 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి సూర్యుడి స్థాన చలనం వల్ల ఏ రాశులపై సానుకూల ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం..
సూర్యుడి స్థాన చలనం వలన కలిగే ప్రభావం..
మేషరాశి: సూర్యుడి స్థాన చలనం కారణంగా మేషరాశి వారికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం విస్తరించే అవకాశం కూడా ఉంది. సామాజిక హోదా, సమాజంలో ప్రతిష్ట కూడా పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది.
సింహరాశి: వాస్తవానికి సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ నెల రోజుల వ్యవధిలో ఈ రాశి వారు చేపట్టిన పనులన్నింట్లో ఆశించిన విజయం సాధించగలరు. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రయత్నాలను కొనసాగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది వీరికి మంచి సమయం.
తులారాశి: సూర్య సంచారం తులారాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో కొన్ని పనులు పూర్తి చేయడంలో జాప్యం ఉండొచ్చు కానీ.. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రతిపాదన అందుకోవచ్చు. కెరీర్లో మార్పు మీకు సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆధ్యా్త్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చిక రాశి: సూర్యుడి స్థాన చలనం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. జీతం పెరుగుదల గురించిన శుభవార్త వింటారు. అలుపెరగని పోరాటం, ధైర్యం, శక్తియుక్తుల కారణంగా అసాధ్యమైన పనులను సైతం సుసాధ్యం చేస్తారు. అనుకోని గౌరవం పొందుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి: సూర్య సంచారం కారణంగా ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఊహించని పురోగతిని పొందుతారు. ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతిని పొందుతారు. సంపద కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ప్రయత్నాలను ఆపొద్దు.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం జ్యోతిష్య నిపుణులు, హిందూ మతగ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.