Share News

Horoscope: రాశిఫలాలు

ABN , Publish Date - May 15 , 2024 | 07:32 AM

నేడు (15-5-2024 - బుధవారం ) వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.....

Horoscope:  రాశిఫలాలు

నేడు (15-5-2024 - బుధవారం ) వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.....

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. టెలివిజన్‌, క్రీడలు, చిట్‌ఫండ్‌లు, ఆడ్వర్టయిజ్‌మెంట్‌, కన్సల్టెన్సీ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకరంగా ఉంటుంది. సంకల్ప సాధనలో ఆటంకాలు ఎదురవుతాయు. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగస్తుంది. దూరంలో ఉన్న ప్రియతములు ఇల్లు చేరడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. తోబుట్టువులు, సన్నిహితుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యా సంస్థలు, రవాణా మార్కెటింగ్‌ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీ రామచంద్రుని ఆరాధన శుభప్రదం.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో అనుకోని సమస్యలు ఎదుర య్యే అ వకాశం ఉంది. తొందపపాటు నిర్ణయాల కారణంగా నష్టం జరగవచ్చు. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ గణేశ పంచరత్న మాలా పారాయణ శుభప్రదం.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత పదవులు, ప్రమోషన్ల విషయంలో కొంత నిరాశ ఎదురవుతుంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే అెకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదే శీ ప్రయాణాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయ, సినీరంగాల వారు నిదానం పాటించాలి. కొత్త వ్యూహాల అమలుకు సరైన సమయం కాదు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురువుతాయి. పందాలు పోటీలకు దూరంగా ఉండటం మేలు. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, ఇతర పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వైద్య సేవలకు ఖర్చులు అధికం. గణపతిని ఆరాధించండి


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

సంకల్ప సాదనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు తగిన సమయం కాదు. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. వృత్తిపరమైన లక్ష్య సాధనలో భాగస్వాయి సహకారం లోపిస్తుంది. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, వైద్య రంగాల వారికి అంచనాలు ఫలించవపోచ్చు. న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ రామచంద్రుని ఆరాధన మేలు చేస్తుంది.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సకాలంలో డబ్బు చేతికి అందుక ఇబ్బంది పడతారు. ఖ ర్చులు అంచనాలు మించిపోతాయి. చిన్నారుల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెన్షన్‌, బీమా, గ్యాట్యుటీ సమస్యలు పరిష్కారం అవుతాయి. గణపతిని ఆరాదించండి.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకలు, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. పరిశ్రమలు, వైద్యం, హోటల్‌ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

Updated Date - May 15 , 2024 | 07:32 AM