Share News

AP TET 2024: టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:30 PM

టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

AP TET 2024: టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
AP TET 2024

అమరావతి: టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్‌ను (AP TET Schedule) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేయనున్నట్టు, తుది ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 8 వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చునని, ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


సెప్టెంబర్ 19 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు నిర్వహించనున్నామని, సెప్టెంబర్ 22 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు జీవో నెంబర్ 284ను స్కూల్ ఎడ్యూకేషన్ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. కాగా డీఎస్సీ రాయాలనుకునేవారు టెట్ అర్హత సాధించడం తప్పనిసరి అనే విషయం తెలిసిందే.


కాగా ఎన్నికల హామీ నెరవేర్చడంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసిన విషయం తెలిసింవదే. అయితే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని అభ్యర్థన రావడంతో కొత్త టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

రూ.50వేల రివార్డు ప్రకటించిన అనకాపల్లి పోలీసులు.. ఎందుకో తెలుసా?

మోదీ, చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

For more AP News and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 04:51 PM