Share News

బిట్స్‌ పిలానీలో పీహెచ్‌డీ

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:17 AM

పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(బిట్స్‌)- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (సెకండ్‌ సెమిస్టర్‌) 2025 జనవరి సెషన్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంప్‌సలలో పార్ట్‌ టైం, ఫుల్‌ టైం కోర్సులు అందుబాటులో ఉన్నాయి...

బిట్స్‌ పిలానీలో పీహెచ్‌డీ

బిట్స్‌ పిలానీలో పీహెచ్‌డీ

పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(బిట్స్‌)- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (సెకండ్‌ సెమిస్టర్‌) 2025 జనవరి సెషన్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంప్‌సలలో పార్ట్‌ టైం, ఫుల్‌ టైం కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

స్పెషలైజేషన్‌లు

బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌, మేథమెటిక్స్‌, మెకానికల్‌, ఫార్మసీ, ఫిజిక్స్‌


అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ/ఎంటెక్‌/ఎంఫార్మసీ/ఎంబీఏ/ఎంఫిల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. ఎమ్మెస్సీ/బీఈ/బీఫార్మసీ అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు నిర్దేశిత కోర్సు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగానికి కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ పూర్తిచేసి ఉండాలి. మేనేజ్‌మెంట్‌ విభాగానికి ఎంకాం/ఎంఏ(సైకాలజీ/ఎకనామిక్స్‌)/ఎమ్మెస్సీ(ఎకనామిక్స్‌/ఐటీ/ఆపరేషన్స్‌ రీసెర్చ్‌/బిజినెస్‌ అనలిటిక్స్‌)/ఎంసీఏ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉన్నవారు మాత్రమే పార్ట్‌ టైం పీహెచ్‌డీకి అర్హులు. వీరు పనిచేస్తున్న సంస్థ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి.


ఫెలోషిప్‌

ఫుల్‌ టైం పీహెచ్‌డీ అభ్యర్థులకు ఫెలోషిప్‌ సౌకర్యం కల్పిస్తారు. వీరు వారానికి ఎనిమిది గంటలు అసిస్టెంట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఎంఈ/ఎంటెక్‌/ఎంఫార్మసీ/ఎంబీఏ/ఎంఫిల్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.37,000 చెల్లిస్తారు. ఎమ్మెస్సీ/బీఈ/బీఫార్మసీ అర్హత ఉన్న అభ్యర్థులకు మొదట నెలకు రూ. 34,000; కోర్సు వర్క్‌ పూర్తయిన తరవాత నెలకు రూ.37,000 ఇస్తారు.

రిటెన్‌ టెస్ట్‌ వివరాలు

ఇందులో రెండు టెస్ట్‌లు ఉంటాయి. బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌ విభాగాలకు మొదటి టెస్ట్‌ కామన్‌గా ఉంటుంది. ఇందులో జనరల్‌ సైన్స్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ అండ్‌ అనాలిసిస్‌, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలనుంచి 30 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం గంట. రెండో టెస్ట్‌లో సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి 70 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. దీనికి పరీక్ష సమయం ఒకటి/రెండు గంటలు. రెండు టెస్ట్‌లలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. సమాధానం తప్పుగా గుర్తిస్తే అర మార్కు కోత విధిస్తారు.

హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ విభాగాలకు నిర్వహించే మొదటి టెస్ట్‌లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌(రెండు ప్యాసేజ్‌లు)నుంచి 10, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 10, అనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి 15, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. రెండో టెస్ట్‌లో సంబంధిత సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

మేనేజ్‌మెంట్‌ విభాగానికి నిర్వహించే టెస్ట్‌లో బేసిక్‌ మేనేజ్‌మెంట్‌ నాలెడ్జ్‌, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీనికి పరీక్ష సమయం గంట.

అడ్మిషన్‌ టెస్ట్‌ నిమిత్తం వివిధ విభాగాలకు నిర్దేశించిన సిలబస్‌ వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


ఎంపిక

దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరిని మాత్రమే అడ్మిషన్‌ టెస్ట్‌కు పిలుస్తారు. ఇందులో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. రాత పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు. యూజీసీ-సీఎ్‌సఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎ్‌ఫ/డీబీటీ జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు అడ్మిషన్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. వీరికి నేరుగా అడ్మిషన్‌ ఇస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు ఫీజు: రూ.2600

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 18

  • అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: డిసెంబరు 2న

  • అడ్మిషన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబరు 16, 17

  • ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: డిసెంబరు 23

  • ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 2025 జనవరి 4న

  • క్యాంపస్‌ రిపోర్టింగ్‌: 2025 జనవరి 4న

  • కోర్సు రిజిస్ట్రేషన్‌: 2025 జనవరి 6న

  • ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌లు: 2025 జనవరి 6 నుంచి 10 వరకు

  • క్లాస్‌ వర్క్‌ ప్రారంభం: 2025 జనవరి 7 నుంచి

  • వెబ్‌సైట్‌: bitsadmission.com

Updated Date - Oct 11 , 2024 | 06:17 AM