Share News

Coffee For Skin : చర్మం నిగారింపును పెంచే కాఫీ.. దీనితో ముఖానికి అందాన్ని పెంచండిలా..!

ABN , Publish Date - Jun 29 , 2024 | 10:56 AM

ఫేస్ మాస్క్‌ను వేయడానికి కాఫీ గ్రౌండ్‌లను పెరుగు లేదా పాలతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.

Coffee For Skin : చర్మం నిగారింపును పెంచే కాఫీ.. దీనితో ముఖానికి అందాన్ని పెంచండిలా..!
skin glow

కాఫీ (coffee for skin) తాగగానే మంచి ఫీల్ వస్తుంది. ఇందులోని కెఫిన్ ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అదే కాఫీ పొడిని ముఖానికి అప్లయ్ చేసి చూడండి. ముఖ చర్మం ఎంత నిగారింపుతో మెరుస్తుందో..

కాఫీ స్క్రబ్..

స్ర్కబ్ చేయడానికి కొబ్బరి నూనె లేదా తేనెతో కాఫీ గ్రౌండ్స్ కలపండి. మృత చర్మకణాలను ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, కణాలను తొలగించడానికి చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి.

కాఫీ ఫేస్ మాస్క్..

ఫేస్ మాస్క్‌ను వేయడానికి కాఫీ గ్రౌండ్‌లను పెరుగు లేదా పాలతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లయ్ చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. చర్మం మరింత శుభ్రంగా కూడా మారుతుంది.


Women Health : మోనోపాజ్ 40లలోనే వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.

కాఫీ ఐ క్రీమ్..

ఐ క్రీమ్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుంటే కంటి కింద నల్లని మచ్చలు, నల్లటి వలయాలు తగ్గిపోతాయి, కళ్ళు తాజాగా కనిపిస్తాయి.

సెల్యులైట్ చికిత్స..

కొబ్బరి నూనె వంటి క్యారియర్ ఆయిల్‌తో కాఫీ గ్రౌండ్‌లను కలపాలి. చర్మం ముడతలు, బిగుతుగా ఉన్న ప్రదేశాలను టోన్ చేయడానికి సహాయపడుతుంది.

Dry Fruits : మధుమేహంతో పోరాడటానికి ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.. వేటిని తీసుకోకూడదు..!

యాంటీ ఇన్ఫ్లమేటరీ పేస్ట్..

కాఫీ గ్రౌండ్స్, నీటితో పేస్ట్ చేయాలి. ఎరుపు, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్రగా ఉన్న చర్మాన్ని ఇది మామూలు స్థితికి తీసుకువస్తుంది.

లిప్ స్క్రబ్ ..

లిప్ స్ర్కబ్ చేయడానికి కాఫీ పేస్ట్‌ని కాస్త తేనెతో కలిపి తీసుకోవాలి. దీనిని పెదవులమీద అప్లయ్ చేయాలి. ఈ పేస్ట్ మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ మిశ్రమాన్ని మృదువుగా పెదవుపై రుద్దాలి.

జుట్టుకు చికిత్స..

షాంపూ చేసే ముందు జుట్టుకు కాఫీ నీటిని పట్టించి కాసేపు వదిలేసి, తర్వాత షాంపూ చేయాలి. ఇది జుట్టు కుదుళ్ళను ఒత్తుగా చేస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 29 , 2024 | 10:56 AM